తెలంగాణ బీజేపీలో కీలక నేత ఈటల రాజేందర్( BJP Leader Etela Rajender ) పార్టీ మారే అవకాశం ఉందని తెలుస్తోంది.ఇటీవలే ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ నేలు మైనంపల్లి హన్మంతరావు, పట్నం మహేందర్ రెడ్డితో భేటీ అయ్యారు.
ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారతారనే చర్చ జోరుగా నడుస్తోంది.ఈటల రాజేందర్ త్వరలోనే హస్తం గూటికి చేరతారని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా( Karimnagar Congress Candidate ) పోటీ చేస్తారనే పార్టీ వర్గాలు చెబుతున్నట్లు సమాచారం.

అయితే తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపు నుంచి రెండు స్థానాల్లో పోటీ చేసిన ఈటల ఓటమి పాలైన సంగతి తెలిసిందే.కాగా దీనిపై అధికారిక ప్రకటన విడుదల కాలేదు.







