శరీర దుర్వాసన ఆడ, మగ అనే తేడా లేకుండా ఎందరినో వేధించే కామన్ సమస్య ఇది.ముఖ్యంగా ప్రస్తుత వేసవి కాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది.
ఉదయం ఎంత శుభ్రంగా స్నానం చేసినప్పటికీ మధ్యాహ్నానికే చెమటలు పట్టేసి బాక్టీరియా శరీరంపై పేరుకుపోతుంది.దాంతో శరీర నుంచి దుర్వాసన వస్తుంది.
ఈ వాసనకు తమతో పాటు పక్కని వారు కూడా అసౌకర్యంగా ఫీల్ అవుతుంటారు.దీంతో ఈ సమస్యకు ఎలా చెక్ పెట్టాలో తెలియక సతమతమవుతుంటారు.
అయితే శరీర దుర్వాసనకు చెక్ పెట్టడంతో టీ ట్రీ ఆయిల్ అద్భుతంగా సహాయపడుతుంది.టీ ట్రీ ఆయిల్‌ను ఆస్ట్రేలియాలోని మెలాల్యుకా అల్టెర్నోఫోలియా మొక్క నుంచి తీస్తారు.ఈ ఆయిల్ చర్మ సౌందర్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.ముఖ్యంగా శరీర దుర్వాసనతో బాధ పడే వారికి టీ ట్రీ ఆయిల్ గ్రేట్‌గా సమాయపడుతుంది.
ఉదయం స్నానం చేసేటప్పుడు ఒక స్పూన్ టీ ట్రీ ఆయిల్‌ను నీటిలో కలిపి స్థానం చేయాలి.ఇలా ప్రతి రోజు చేస్తే టీ ట్రీ ఆయిల్‌లో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు శరీరంపై బ్యాక్టీరియా నాశనం చేస్తాయి.దాంతో శరీరం నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది.ఇక నోటి దుర్వాసనను నివారించడంలోనూ టీ ట్రీ ఆయిల్ ఎఫెక్టివ్‌గా ఉపయోగపడుతుంది.
ముందుగా ఒక కప్పు వేడి నీటిలో రెండు మూడు చుక్కల టీ ట్రీ ఆయిల్ వేసి నోటిని శుభ్రం చేసుకోవాలి.ప్రతి రోజు ఉదయాన్నే ఇలా చేస్తే నోటి దుర్వాసన సమస్యే ఉండదు.
అయితే టీ ట్రీ ఆయిల్ మిక్స్ చేసిన వాటర్‌ను ఎట్టి పరిస్థితుల్లో మింగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.అలాగే ప్రస్తుతం మార్కెట్‌లో చాలా రకాల టీ ట్రీ ఆయిల్స్ అందుబాటులో ఉన్నాయి.
అయితే వాటిలో వంద శాంత న్యాచురల్ ఆయిల్ అని ఉన్న వాటిని ఎంచుకోవాలి.
.