గతంలో ఎన్నడూ లేని రీతిలో జరిగాయి మా ఎన్నికలు.గతంలో పలుమార్లు ఎన్నికలు జరిగినా.
పలువురు నటులు మా అధ్యక్షులుగా పని చేసినా.ఏనాడూ ఈసారి మాదిరి విమర్శలు, ప్రతి విమర్శులు, హద్దులు దాటిన ఆరోపణలు కనిపించలేదు.
ఈ సారి మాత్రం మా ఎన్నికల పుణ్యమా అని అవన్నీ జరిగాయి.మొత్తంగా ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ఆటలో అరటి పండు అయ్యాడు అనే మాటలు వినిపిస్తున్నాయి.
ఎందుకంటే.మొదటి నుంచి తనకు సపోర్టు చేస్తున్న మెగా ఫ్యామిలీ.
ఈ ఎన్నికల్లో కనీసం తమ వ్యక్తుల చేత కూడా ఆయనకు ఓట్లు వేయించలేకపోయింది.అటు మంచు విష్ణు మాత్రం జయప్రదతో పాటు జెనీలియా వరకు ఎక్కడో ఉన్న సభ్యులను తీసుకొచ్చి ఓటు వేయించాడు.
విజయం సాధించాడు.
ఈ ఎన్నికల పుణ్యమా అని చాలా మంది మనసులు గాయపడ్డాయి.
ఇందులో కాదనలేని ముచ్చట ఏమీ లేదు.విష్ణు, నాగబాబు.
ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు.కానీ ఎప్పుడూ పరిధి దాటి విమర్శలు చేసుకోలేదు.
కానీ ఈ ఎన్నికల్లో తేనెతెట్టెను కదిపింది మాత్రం మెగా సోదరుడు నాగబాబే.ఆయన ఈ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాతే పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
నాగబాబు తనకు సపోర్టుగా మాట్లాడ్డంతో ప్రకాష్ రాజ్ మరింత రెచ్చిపోయాడు.సినీ పెద్దలపై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేశాడు.

ప్రకాష్ రాజ్ మాటలతో మొత్తంగా నటీనటులు రెండుగా చీలిపోయారు.సిట్టింగ్ అధ్యక్షుడు నరేష్ మొత్తంగా మంచు ఫ్యామిలీకే మద్దతు ఇచ్చాడు.అనుకున్నట్లుగానే విష్ణు మా తదుపరి అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యాడు.అయితే తన గెలుపుకు కారణం అయిన నరేష్ మీద చర్యలు తీసుకోవాలని శివాజీ రాజా లాంటి నటులు డిమాండ్ చేస్తున్నాడు.
మా అసోషియేషన్ లో ఆయన పలు తప్పుడు చేశాడని.వాటి కారణంగా తనపై యాక్షన్ తీసుకోవాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు.అయితే ఈ విషయంలో విష్ణు ఏం చేస్తాడు అనేది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది.