తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళ కంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే.జూనియర్ ఎన్టీఆర్( Jr.
NTR ) లాంటి నటుడు సైతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు.ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తు అయితే ఇక మీదట చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారాబోతున్నాయి.
గత సంవత్సరం దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఆ సినిమాతో ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేకపోయాడు.ఇక ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేస్తున్న డ్రాగన్ సినిమా ( Dragon movie )మీద ఆయన భారీ అంచనాలు పెట్టుకున్నాడు.
మరి ఈ సినిమాతో కనక సూపర్ సక్సెస్ ను సాధిస్తే ఆయనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్న వాడు అవుతాడు.ఎన్టీఆర్ నెల్సన్( Nelson ) కాంబినేషన్ లో కూడా సినిమా రాబోతుంది అనే విషయం మనకు తెలిసిందే.

మరి ఈ కాంబినేషన్ ఎప్పుడు వర్కౌట్ అవుతుంది అనే విషయంలో సరైన క్లారిటీ అయితే లేదుగానీ మొత్తానికైతే ఈ సినిమాతో తనకంటూ ఒక భారీ గుర్తింపును తెచ్చుకోవడమే కాకుండా ఆయనలోని మాస్ యాంగిల్ ని సరికొత్త విధంగా ఆయన బయటకు తీయబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి.ఇక ఇప్పటికైనా నెల్సన్ చేసిన జైలర్ సినిమా భారీ విజయాన్ని సాధించింది.ఇక దానికి తోడుగా ఇప్పుడు నెల్సన్ జైలర్ 2 సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో కూడా తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది…
.