హెయిర్ ఫాల్( Hair fall ) అనేది అందరిలోనూ ఉండే కామన్ సమస్య.అలాగే జుట్టు పల్చగా మారడం, జుట్టు చివర్లు చిట్లడం, జుట్టు విరగడం, జుట్టు డ్రై గా మారడం వంటి సమస్యలు కూడా అత్యధిక శాతం మందిని వేధిస్తూ ఉంటాయి.
వీటి నుంచి విముక్తి పొందడం కోసం తోచిన చిట్కాలను పాటిస్తుంటారు.అయితే పైపై పూతలతోనే వీటిని నివారించుకోవచ్చు అనుకుంటే పొరపాటే.
ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ను వారంలో కేవలం రెండు సార్లు తీసుకుంటే కనుక ఆయా జుట్టు సమస్యలన్నీ దెబ్బకు పరార్ అవుతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా మూడు ఉసిరికాయలను( Amla ) తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి గింజ తొలదించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు, రెండు రెబ్బల కరివేపాకు( curry leaves), హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి, చిటికెడు పింక్ సాల్ట్, వన్ టేబుల్ స్పూన్ బెల్లం పొడి( Jaggery powder ), ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
తద్వారా మన డ్రింక్ సిద్ధం అవుతుంది.

ఈ డ్రింక్ టేస్టీగా ఉండటమే కాదు.జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.వారంలో కేవలం రెండుసార్లు ఈ డ్రింక్ ను తీసుకుంటే కనుక జుట్టు కుదుళ్ళు దృఢంగా మారతాయి.
దాంతో హెయిర్ ఫాల్ క్రమంగా దూరం అవుతుంది.అలాగే ఈ డ్రింక్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది.

జుట్టు విరగడం చిట్లడం వంటి సమస్యలు అదుపులోకి వస్తాయి.అలాగే పొడి జుట్టు సమస్య నుంచి సైతం విముక్తి లభిస్తుంది.పైగా ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల త్వరగా తెల్ల జుట్టు సమస్య రాకుండా కూడా ఉంటుంది.కాబట్టి జుట్టు ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని భావించేవారు తప్పకుండా ఈ డ్రింక్ ను డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.







