'పుష్ప 2'లో లేడీ పవర్ స్టార్.. ఆ వార్తలపై అమ్మడు క్లారిటీ!

ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చి.తన అందం, అభినయంతో మొదటి సినిమా తోనే అందరిని ఫిదా చేసి.

 Is Sai Pallavi Part Of Allu Arjun's Pushpa 2, Sai Pallavi, Allu Arjun, Pushpa 2,-TeluguStop.com

న్యాచురల్ బ్యూటీ అనే గుర్తింపుతో తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ను ఏర్పరుచుకున్న భామ సాయి పల్లవి ( Sai Pallavi ).ఇప్పుడు సాయి పల్లవి అంటే పేరు కాదు.బ్రాండ్ అనే స్థాయికి ఈమె చేరుకుంది.సౌత్ ఇండస్ట్రీ లోనే భారీ క్రేజ్ తెచ్చుకున్న ఈ ముద్దు గుమ్మ చేసిన సినిమాలు వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు.

కానీ చేసింది కొన్నే అయినా క్రేజ్ మాత్రం భారీగానే వచ్చింది.ఈ అమ్మడు సినిమాలో ఉంటే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా తేలిపోవాల్సిందే.

అయితే సాయి పల్లవి తన కెరీర్ డల్ అవుతుంది అని ఏ అవకాశాన్ని బడితే ఆ అవకాశాన్ని ఒప్పుకోకుండా సినిమా లోని పాత్ర నచ్చితేనే ఓకే చెప్పడంవంటివి చేయడం వల్ల తన కెరీర్ లో ఎక్కువ సినిమాలు చేయలేక పోయింది.

సాయి పల్లవి ఇటీవలే నటించిన సినిమాల్లో ”గార్గి” ఒకటి.ఈ సినిమా తర్వాత మళ్ళీ ఈమె నుండి ఏ సినిమా అప్డేట్ అయితే రాలేదు అనే చెప్పాలి.కానీ గత కొంత కాలంగా ఈమె గురించి ఒక ఇంట్రెస్టింగ్ రూమర్ వినిపిస్తుంది.

లేడీ పవర్ స్టార్ అని పిలిపించు కుంటున్న సాయి పల్లవి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) పుష్ప 2 ( Pushpa 2 ) సినిమాలో భాగం కాబోతుంది అని టాక్ వినిపిస్తూనే ఉంది.

మరి ఈ వార్తలపై ఈ అమ్మడు తాజా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేసింది.పుష్ప 2 సినిమాలో సాయి పల్లవి కూడా ఉంది వచ్చే వార్తలపై ఈమె మాట్లాడుతూ.నేను ఈ సినిమాలో నటించడం లేదు.

కానీ ఈ సినిమాలో నేను కూడా ఉన్నానని వచ్చిన వార్తలకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.అని అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఈమె చెప్పడంతో ఈమె ఫ్యాన్స్ కొద్దిగా నిరాశ చెందారు.

ఈ పాన్ ఇండియన్ సినిమాలో ఈమె కూడా ఉంది అనుకుని ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.కానీ ఇప్పుడు ఈమె క్లారిటీ ఇవ్వడంతో నిరాశ చెందుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube