పాలిచ్చే తల్లులు ప్రతిరోజూ తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఇవే..!

తల్లి పాలు( Mothers Milk ) బిడ్డకు ఒక వరం లాంటివి అని దాదాపు చాలా మందికి తెలుసు.ఇందులో శిశువుకి అవసరమయ్యే అన్ని పోషకాలు లభిస్తాయి.

 What To Eat While Feeding Your Child Breast Milk,breastfeeding,mothers Milk,milk-TeluguStop.com

అలాగే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి.నవజాత శిశువు అభివృద్ధికి తోడ్పడతాయి.

అందుకే ప్రతి ఒక్క మహిళ డెలివరీ అయిన తర్వాత బిడ్డకి పాలని అందిస్తూ ఉంటారు.అయితే తల్లి ఆరోగ్యం బిడ్డ ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది.

అందుకే పాలిచ్చే తల్లులలో ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే పాలిచ్చే తల్లులు( Breastfeeding ) ఆరోగ్యకరమైన ఆహారం తినడానికి ప్రయత్నించాలి.దీని వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది.

పిల్లలకి తృప్తిగా కడుపు నిండుతుంది.పాలిచ్చే తల్లులు కెఫిన్ ఉండే పానీయాలకు దూరంగా ఉండాలి.

Telugu Alcohol, Caffine, Child, Dry Fruits, Fenugreek Seeds, Tips, Milk, Mothers

ముఖ్యంగా కొంత మంది ఏమీ ఆలోచించకుండా టీ, కాఫీలు తాగుతారు.కెఫిన్( Caffine ) అధికంగా ఉండడం వల్ల నిద్రలేమి, తల నొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి.కాబట్టి కెఫిన్ తో కూడిన పదార్థాలు తక్కువగా తీసుకోవాలి.ఇంకా చెప్పాలంటే పాలిచ్చే తల్లులు ఆల్కహాల్( Alcohol ) అస్సలు తీసుకోకూడదు.మద్యం లేదా మాదకద్రవ్యాలు వినియోగించినట్లయితే శిశువుకి పాలు ఇవ్వకూడదు.మద్యానికి పూర్తిగా దూరంగా ఉంటే శిశువు ఆరోగ్యానికి ఎంతో మంచిది.

Telugu Alcohol, Caffine, Child, Dry Fruits, Fenugreek Seeds, Tips, Milk, Mothers

పాలిచ్చే తల్లులు ఆహారంలో వాల్‌నట్‌లు, జీడిపప్పు, ఎండుద్రాక్ష, పిస్తా, బాదంపప్పును ఆహారంలో భాగం చేసుకుంటే రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినాలి.అలాగే పోషకాలు అధికంగా ఉండే డ్రై ఫ్రూట్స్‌( Dry fruits ) శరీరానికి బలాన్ని అందిస్తాయి.అలాగే తీసుకుంటూ ఉండాలి.అంజీర పండ్లను పాలలో ఉడకబెట్టి తీసుకోవాలి.అయితే ఎక్కువగా తీసుకోకూడదు అని గుర్తుపెట్టుకోవడం మంచిది.ముఖ్యంగా చెప్పాలంటే పాలిచ్చే తల్లులు ఆహారంలో మెంతులను చేర్చుకోవాలి.

వీటితో టీ తయారు చేసి తాగవచ్చు.మెంతులు( Fenugreek Seeds ) జీర్ణ క్రియను మెరుగుపరుస్తాయి.

తర్వాత తిమ్మిరి వంటి సమస్యలను దూరం చేస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube