Karthika pournami : దేవాలయాలలో ఘనంగా జరిగిన కార్తీక మాసం వేడుకలు..

మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలు కార్తిక మాసాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటారు.ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు పాటిస్తూ గుడికి వెళ్లి దేవునికి పూజలు చేస్తూ ఉంటారు.

 Kartikamasam Celebrations Held Grandly In Temples, Kartika Masam, Kartika Pourn-TeluguStop.com

కార్తీక మాసం సందర్బంగా దేవాలయాలన్ని భక్తులతో రద్దీగా ఉంటాయి.కార్తికమాసం పురస్కరించుకొని ఆలయాన్ని ప్రత్యేకమైన దీపాలతో భక్తులు అలంకరిస్తూ ఉంటారు.

చాలా రకాల వంటలతో నైవేద్యాన్ని భగవంతునికి సమర్పించుకుంటూ ఉంటారు.దానితోపాటు దీపాలు వెలిగించి దీపారాధన చేస్తూ ఉంటారు.

అయితే శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని రాధామాధవ మఠంలో కార్తీక మహోత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి.స్వామి వారికి 56 రకాల వంటకాలను నైవేద్యంగా భక్తులు సమర్పిస్తారు.

ఉదయం నుంచి భజన కార్యక్రమం, ప్రత్యేక పూజలు ఎంతో భక్తితో చేస్తారు.మఠం పీఠాధిపతి మహంత్ మదన్ గోపాల్ దాస్​జీ మహరాజ్ ఆధ్వర్యంలో ఈ పూజ కార్యక్రమం నిర్వహించారు.

భక్తుల రద్దీతో మఠం కళకళలాడుతుంది.మన దేశంలోని చాలా దేవాలయాల్లో కార్తిక మాసం వేడుకలు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవాలయంలో కార్తికమాసం పురస్కరించుకొని ఆలయాన్ని ప్రత్యేకమైన దీపాలతో అలంకరిస్తారు.

Telugu Bhakti, Devotional, Gopaiah Swammy, Kartika Masam, Pooja, Temples, Tirupa

తిరుపతమ్మ, గోపయ్య స్వాముల అంతరాలయం, ఆలయంలో కొలువుదీరిన సహదేవతల ఆలయాలను దీపాల తో అలంకరించి ఎంతో భక్తితో పూజలు చేస్తారు.ప్రత్యేకమైన దీపాలంకరణలో కొలువుదీరిన అమ్మవారిని భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుని పూజలు చేసి, ఆ తర్వాత దీపాలను వెలిగించి దీపారాధన కూడా చేస్తారు.మన దేశ వ్యాప్తంగా కార్తీక మాసాన్ని ప్రజలందరూ తమ కుటుంబ సభ్యులతో పాటు ఎంతో సంతోషంగా పండుగను చేసుకుంటారు.కార్తీక మాసం 30 రోజులపాటు ఒక్కొక్క రోజు ఒక్క రకమైన పిండి వంటకాలను వండి దేవుడికి నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube