కొంత మందికి కొన్ని అలవాటు లు ఉంటాయి.అవి మంచివి కాదు అని తెలిసిన వాటిని మార్చుకోలేకపోతారు.
అలాంటిదే కాళ్ళు ఊపడం.మీరు గమనిస్తారో లేదో కానీ చాలా మందికి ఈ అలవాటు ఉంటుంది.
అలా సరదాగా కుర్చీలో కూర్చున్నా లేదా ఏదైనా పనిలో ఉన్న చాలా మంది కాళ్ళు ఉపుతుంటారు.పెద్దవాళ్ళ ముందు కాళ్ళు ఊపితే వారు వెంటనే అలా ఊపకూడదు అని చెప్తుంటారు.
కానీ మనం అంతగా పట్టించుకోము.కానీ ఇందుకు కారణం కూడా లేకపోలేదు.
ఇలా ఎందుకు చేస్తారంటే ఎవరైనా ఒత్తిడి ఎదుర్కొంటున్న, లేదా ఆందోళనలో ఉన్నా ఇలా జరుగుతుందట.అంతే కాదు నిద్ర సరిగ్గా లేకపోయినా, హార్మోన్స్ సమస్యల వల్ల కూడా ఇలా జరుగుతుందని పరిశోధనలలో రుజువయ్యింది.
సరిగ్గా నిద్ర పోనీ వాళ్ళు కుర్చీలో కూర్చుని పడుకుంటే ఆ నిద్రను కంట్రోల్ చెయ్యడానికి ఇలా కాళ్ళు ఊపుతారని దీని వల్ల నిద్ర కంట్రోల్ అవుతుంది కానీ ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.
అంతే కాదు మన శరీరంలో షుగర్ లెవల్స్ కంట్రోల్లో లేనప్పుడు కూడా ఇలా కాళ్ళు వాటంతట అవే కదులుతాయట.ముఖ్యంగా ఈ సమస్య యువతలో ఎక్కువగా కనిపిస్తుంది.దీని నుండి తప్పించుకోవడానికి కూడా మార్గాలు ఉన్నాయి.
అవి ఏంటంటే ప్రతిరోజు యోగా, ధ్యానం వంటివి చేయాలి.అంతేకాదు ఆరు నుండి ఏడు గంటల నిద్ర అవసరం.
అంతేకాదు మంచి ఆహారం తీసుకోవాలి.ఇలా కొన్నిరోజుల పాటు ప్రతి రోజు క్రమం తప్పకుండ చేయడం వల్ల ఈ అలవాటును సరిచేసుకోవచ్చు.
అంతేకాదు రాత్రిపూట నిద్రించే సమయంలో ఫోన్, టివి వంటివి వాడకూడదు.
ఇంత చేసిన ఈ అలవాటు మార్చుకోలేకపోతే ఐరన్ టాబ్లెట్స్ వాడవచ్చని డాక్టర్స్ చెబుతున్నారు.
మీరు ఐరన్ టాబ్లెట్స్ వద్దు అనుకుంటే ఐరన్ లభించే పండ్లు, కూరగాయలు తినాలి.పాలకూర, అరటి పండ్లు, డ్రై ఫ్రూట్ వంటివి తీసుకుంటే ఐరన్ డెఫిసియన్సీ తగ్గుతుంది.
అప్పుడు ఈ కాళ్లు ఊపే సమస్య కూడా పోతుందని నిపుణులు చెబుతున్నారు.