సినిమా అంటే రంగుల ప్రపంచం మాత్రమే కాదు.కోట్ల రూపాయలను కురిపించే ఓ మయా లోకం కూడా.
ఇక్కడ ఒక్కసారి క్లిక్ అయితే చాలు.స్టార్ హీరోలకి కోట్లు వచ్చి పడుతాయి.
అయితే.గత దశాబ్దం క్రితం రెమ్యునరేషన్ విషయంలో బాగా వెనుకపడి ఉన్న తమిళ స్టార్ హీరోలు ఇప్పుడు మన హీరోలను సైతం డామినేట్ చేసేలా రెమ్యునరేషన్స్ పొందుతున్నారు.
మరి.కోలీవుడ్ లో కోట్లు దక్కించుకుంటున్న ఆ స్టార్ హీరోలు ఎవరు? వారి రెమ్యునరేషన్స్ ఎంతన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తమిళ టాప్ హీరోల రెమ్యునరేషన్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే.ముందుగా గుర్తుకి వచ్చే పేరు రజనీకాంత్.సూపర్ స్టార్ క్రేజ్ కేవలం తమిళ సినీ పరిశ్రమకి మాత్రమే కాదు.ఆయనకి ప్రపంచం అంతా అభిమానులు ఉన్నారు.
ప్రతి దగ్గర రజని సార్ కి మార్కెట్ ఉంది.అందుకే రజనీకాంత్ తో హిట్ సినిమా తీస్తే నిర్మాతల తలరాత మారిపోతుంది.
మరి ఇంత క్రేజ్ ఉన్న సూపర్ స్టార్ రజనీకాంత్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? అక్షరాల 100 కోట్లకి పైనే.ఇంకా షాకింగ్ న్యూస్ ఏమిటంటే.
సౌత్ లో 100 కోట్లపైన రెమ్యునరేషన్ అందుకున్న తొలి హీరో రజనీకాంత్ కావడం విశేషం.
రజనీకాంత్ తరువాత తమిళనాట ఆ స్థాయిలో క్రేజ్ దక్కించుకున్న మాస్ హీర్ అంటే విజయ్ అని చెప్పుకోవచ్చు.పైగా వరుస విజయాలు దక్కించుకుంటూ, సూపర్ ఫామ్ లో ఉన్న విజయ్ సినిమాలకి మంచి డిమాండ్ ఉంటుంది.ఇక ఈయన ఫ్యాన్ బేస్ కూడా మాములుగా ఉండదు.
మరి.కలెక్షన్ విషయంలో మాస్టర్ అయిన విజయ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? అక్షరాల 80 నుండి 90 కోట్ల రూపాయల పైనే.రానున్న కాలంలో విజయ్ 100 కోట్ల మార్క్ అందుకోవడం పక్కా అన్న అంచనాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.
విజయ్ తో సమానమైన క్రేజ్ ఉన్న మరో తమిళ హీరో అజిత్.అజిత్ అక్కడ మాస్ హీరోలకే మాస్ హీరో.ఇదే సమయంలో ఆయనకి ఉన్న లేడీ ఫాలోయింగ్ ఇక ఎవ్వరికీ లేదు.
ఇక ఈ గ్యాంబ్లర్ స్టార్ కి మొత్తం సౌత్ లో కూడా సూపర్ ఫాలోయింగ్ ఉంది.కానీ., అజిత్ ఈ మధ్య అంతగా విజయాలను అందుకుంది లేదు.అందుకే విజయ్ తో పోల్చుకుంటే అజిత్ రెమ్యునరేషన్ కాస్త తక్కువగానే ఉంది.
అంటే అజిత్ ఒక్కో సినిమాకి 50 నుండి 60 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు.అది కూడా భారీ బడ్జెట్ చిత్రం అయితేనే!
లోకనాయకుడు కమల్ హాసన్ సినిమాలే కాదు, ఆయన రెమ్యునరేషన్ తీసుకునే విధానం కూడా కాస్త విచిత్రంగానే ఉంటుంది.కమల్ ఒక్కో సినిమాకి 25 నుండి 30 కోట్ల రూపాయలు తీసుకుంటారు.కానీ.
, తన సినిమా బిజినెస్ ని బట్టి మళ్ళీ ఎక్స్ట్రా గా వాటా అందుకుంటారు.కమల్ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతాయి గనుక.
ఆయన ఒక్కో సినిమాకి ఓవరాల్ గా ఎంత తీసుకుంటారు అన్నది అంచనా వేయడం కష్టం.
తమిళ నాట మినిమమ్ గ్యారంటీ ఉన్న అరుదైన స్టార్స్ లో సూర్య ఒకరు.సూర్యకి తమిళంలో పాటు, తెలుగులో కూడా సమానమైన మార్కెట్ ఉంది.ఈ లెక్కన సూర్య ఒక్కో సినిమాకి 30 నుండి 40 కోట్ల రూపాయలు వసూలు చేయడంలో తప్పే లేదు అనుకోవచ్చు.
తమిళనాట వర్సటైల్ స్టార్ గా గుర్తింపు దక్కించుకున్నారు హీరో ధనుష్.ఆయన తన నటనకు జాతీయ చలనచిత్ర అవార్డు సైతం దాసోహం అంది.తెలుగులో కూడా ధనుష్ కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది.ఇక ధనుష్ మాత్రం తన ఒక్కో సినిమాకి 15 కోట్ల రూపాయలు వసూలు చేస్తూ మామకి తగ్గ అల్లుడు అనిపించుకుంటున్నారు.
మరి.చూశారు కదా? తమిళ స్టార్ హీరోల రెమ్యునరేషన్స్.ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.