గడికోటకు మెగా కుటుంబం.. ఎందుకంటే?

మెగాస్టార్ చిరంజీవి అతని కుటుంబ సభ్యులు గడికోట సంస్థానానికి పయనమయ్యారు.ఇలా ఉన్నఫలంగా మెగా కుటుంబం గడికోట వెళ్లడానికి కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.

 Mega Family To The Gadikota Do You Know Why, Mega Family, Upasana, Ram Charan, C-TeluguStop.com

గడికోట సంస్థానాధీశులు కామినేని అనిల్​ కుమార్​, శోభన్ రెండో కుమార్తె, ఉపాసన సోదరి అనుష్పాల వివాహం కానుండడంతో వీరి కుటుంబ సభ్యులు దోమకొండలో పోచమ్మ పండగ నిర్వహించనున్నారు.ఈ పండుగలో భాగంగా మెగా కుటుంబం పాల్గొననున్నారు.

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ దంపతులు ఈ పండుగకు హాజరుకానున్నారు.మెగా కుటుంబంతో పాటు కామినేని కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకోవడంతో పెద్దఎత్తున గడికోటలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇక ఉపాసన సోదరి వివాహ వేడుకలు ప్రారంభం కావడంతో గత రెండు రోజుల క్రితం హిజ్రాలు ఈమె పెళ్లి వేడుకలను ప్రారంభించారు.

ఉపాసన సోదరి అనుష్పాల గత కొన్ని సంవత్సరాల నుంచి చెన్నైకి చెందిన కార్​ రేసర్​ అర్మాన్ ఇబ్రహిమ్​ను ప్రేమించింది.

ఈ క్రమంలోనే తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడనుంది.మాజీ ఇండియన్ ఎఫ్​3 ఛాంపియన్ అక్బర్​ ఇబ్రహిమ్​ తనయుడే అర్మన్ ఇబ్రహిమ్​.

ఇప్పటికే ఈమె పెళ్లి పనులు ప్రారంభం కావడంతో తన వివాహ వేడుకలను ఎంతో అంగరంగ వైభవంగా చేయనున్నారు.ఇక ఈ వేడుకలకు మెగా కుటుంబం హాజరుకానున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube