ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. రాజ్ ( Raj )అనే ఒక భారతీయ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, దాదాపు 10 ఏళ్లుగా కొరియాలో ఉంటున్నాడు.
రీసెంట్‌గా అతను తన కొరియన్ భార్య ( Korean wife )కుటుంబానికి, అత్తమామలకు స్వయంగా భారతీయ వంటకాలు రుచి చూపించాడు.అదే వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.
రాజ్ తన అత్తమామల కోసం పూరీ, ఆలూ మటర్ సబ్జీ ( Aloo matar sabji )వండాడు.వాళ్ల రియాక్షన్స్ ఎలా ఉంటాయోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు.
ముఖ్యంగా, రాజ్ మరదలు మొదటిసారి భారతీయ వంటకం టేస్ట్ చేస్తుంటే, ఆమె ఎక్స్‌ప్రెషన్స్ చూడటానికి అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు.
వీడియోలో, రాజ్ డైనింగ్ టేబుల్‌పై వంటకాలు పెట్టగానే, అతని మరదలు వాటిని చూడగానే “వావ్, చాలా బాగున్నాయి” అని ఎక్సైట్‌మెంట్‌తో సన్నటి కేక పెట్టింది.ఎలా తినాలో తెలియకపోయినా, టేస్ట్ చేయడానికి మాత్రం రెడీగా ఉంది.రాజ్ స్వయంగా ఆమెకు పూరీని సబ్జీలో ముంచి ఎలా తినాలో చూపించాడు.మొదటి బైట్ తిన్న వెంటనే ఆమె ఫేస్‌లో వెలిగిన స్మైల్ చూస్తే, ఆ వంటకం ఎంత నచ్చిందో అర్థమవుతోంది.“సూపర్ ఉంది” అంటూ మళ్లీ మళ్లీ తినడం మొదలుపెట్టింది.చిన్నపిల్లలాంటి ఎక్స్‌ప్రెషన్స్‌తో లోట్టలు వేసుకుంటూ ఆమె తినడం చూస్తే ఎవరికైనా నవ్వు రావాల్సిందే.
“మా కొరియన్ ఫ్యామిలీ ఫస్ట్ టైమ్ పూరీ టేస్ట్ చేసింది” అని క్యాప్షన్ పెట్టి రాజ్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.అంతే! వీడియోకి ఏకంగా 25 మిలియన్ వ్యూస్, 8 లక్షల లైక్స్ వచ్చాయి.ప్రపంచం నలుమూలల నుంచి నెటిజన్లు ఈ వీడియోను చూసి ఫిదా అయిపోతున్నారు.
ఆహారం అనేది భాషలు, సంస్కృతులకు అతీతంగా అందరినీ కలుపుతుందని కామెంట్స్ చేస్తున్నారు.నిజంగా, ఈ వీడియో చూస్తే కల్చర్స్ ఎలా కనెక్ట్ అవుతాయో తెలుస్తుంది.