ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి( Uttarakhand CM Pushkar Singh Dhami ) శనివారం డెహ్రాడూన్‌లో ఉత్తరాంచల్ ప్రెస్ క్లబ్‌కు కొత్తగా ఎన్నికైన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.‘‘ గ్రామాన్ని దత్తత తీసుకోండి’’( Adopt A Village ) కార్యక్రమంపై మన రాష్ట్రానికి చెందిన ప్రవాస భారతీయులు( NRI’s ) ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు.
కొందరు ఎన్ఆర్ఐలు తమ ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందించారని సీఎం వెల్లడించారు.స్థానికుల సూచనల మేరకు గుర్తించిన గ్రామాల సమగ్ర అభివృద్ధి ప్రణాళికలను వారు సిద్ధం చేస్తున్నారని ముఖ్యమంత్రి అభినందించారు.
ఈ గ్రామాలు అభివృద్ధికి( Rural Development ) రోల్ మోడల్‌గా మారడంతో పాటు ఇతర వలసదారులకు కూడా స్పూర్తిగా నిలుస్తుందన్నారు.
గతేడాది మార్చి 5న వివిధ దేశాలలో నివసిస్తున్న ప్రవాస భారతీయులతో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ సంభాషించారు.ఈ సందర్భంగా ‘అడాప్ట్ ఏ విలేజ్ ’ ఆలోచన రూపుదిద్దుకుంది.ఈ కార్యక్రమంలో భాగంగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ గ్రామాలను దత్తత తీసుకోవాలని ఎన్ఆర్ఐలకు సీఎం విజ్ఞప్తి చేశారు.
దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల ప్రజలు తమ గ్రామాల్లో చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాల రోడ్ మ్యాప్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు.
చైనాలో స్థిరపడిన దేవ్ రాటూరి. టెహ్రీ జిల్లాలోని సునార్ , కమైరా సౌద్ అనే రెండు గ్రామాలను దత్తత తీసుకుని సోలార్ లైట్లను( Solar Lights ) అమర్చడంతోపాటు చైనాలోని తన హోటల్‌లో యువతకు ఉపాధి కల్పించడం, విద్యారంగంలో సహయ కార్యక్రమాలు చేస్తున్నారు.అలాగే అమెరికాలో స్థిరపడిన శైలేష్ ఉప్రేతి.
అల్మోరా జిల్లాలోని మనన్ గ్రామంలో తన కంపెనీకి చెందిన ఇండియా కార్పోరేట్ కార్యాలయాన్ని ప్రారంభించడంతో పాటు ఎనర్జీ స్టోరేజ్‌ను ప్రారంభించేందుకు కృషి చేస్తున్నారు.
యూఏఈలో స్థిరపడిన తెహ్రీ జిల్లాకు చెందిన వినోద్ జెతూరి . ఉత్తర కాశీ జిల్లా ఓస్లా గ్రామంలో నైపుణ్య శిక్షణ కోసం పనిచేస్తానని తెలిపారు.పితోర్‌గఢ్ నివాసి గిరిష్ పంత్ విద్యారంగానికి ప్రోత్సహించే దిశగా పనిచేస్తానని వెల్లడించారు.
.