మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) తాజాగా అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ నిర్వహించిన సదస్సులో పాల్గొని సందడి చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తన కుటుంబం గురించి అలాగే తన కుటుంబ సభ్యులు సాధించిన విజయాల గురించి మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు.
తాను కాలేజీ చదువుతున్న రోజులలో రాజీనామా అనే ఒక డ్రామా చేశాను ఆ డ్రామాని నా జీవితాన్ని మలుపు తిప్పిందని చిరంజీవి అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు.ఈ డ్రామాలో నేను నటించినందుకు నాకు బెస్ట్ యాక్టర్ గా అవార్డు వచ్చింది.
దీంతో నాకు నటనపై ఆసక్తి పెరిగి ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేరాను అని తెలిపారు.
ఇలా ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేరిన నేను నా ఫోటోలను పట్టుకొని ఏ స్టూడియో వద్దకు వెళ్లి అవకాశాలను అడగలేదు నాకు అవకాశాలే వెతుక్కుంటూ వచ్చాయని చిరు తెలిపారు.తన అచీవ్ మెంట్ పవన్ కల్యాణ్( PawanKalyan ) , తన అచీవ్ మెంట్ రామ్ చరణ్( Ramcharan ) , తన అచీవ్ మెంట్ తన కుటుంబ సభ్యులు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.వాళ్లను చూస్తుంటే ఇది కదా నేను సాధించింది అనే ఆనందం నాకు కలుగుతుందని తెలిపారు.
ఒక సందర్భంలో నేను పవన్ కళ్యాణ్ కు చెప్పిన మాటలు ఇటీవల ఆయన నా ఇంటికి వచ్చి నాకు ఆ మాటలను గుర్తు చేశారని చిరంజీవి తెలిపారు.మన ఇంట్లో ఇంతమంది ఉన్నందుకు, ఇది నాతో ఆగిపోకూడదు.ఓ రాజ్ కపూర్ ఫ్యామిలీలో ఎంత మంది ఉన్నారో, అలాగే మరో రాజ్ కపూర్ ఫ్యామిలీగా మన మెగా కుటుంబం కావాలి అంటూ నువ్వు చెప్పావు ఇప్పుడు మన కుటుంబం అలాగే ఉంది.అది మీ మాట పవర్ అంటే అంటూ పవన్ నాకు గుర్తు చేశారని చిరంజీవి తెలిపారు.
ఇటీవల ఓ పత్రిక మెగా కుటుంబం గురించి వర్ణిస్తూ సౌత్ ఇండియా కపూర్ ఫ్యామిలీ అని చెప్పడం చాలా సంతోషాన్ని కలిగించిందని తెలిపారు.వ్యతిరేకతను మనం అధిగమిస్తేనే ఉన్నత స్థాయికి చేరుకుంటాము అంటూ ఈయన ఎంతో స్ఫూర్తిదాయకమైన విషయాలను కూడా అందరితో పంచుకున్నారు.