ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.24
సూర్యాస్తమయం: సాయంత్రం 05.36
రాహుకాలం: ఉ.7.30 ల9.00 వరకు
అమృత ఘడియలు: ఉ.సా 2.00 ల6.00 వరకు
దుర్ముహూర్తం: మ.12.47 ల1.38 ల3.20 సా 4.11 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.ప్రారంభించే పనుల్లో ఈరోజు మీ సొంత నిర్ణయాలు పనికిరావు.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
వృషభం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం వలన భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.దూర ప్రాంతాల నుండి అనుకోకుండా శుభవార్త వింటారు.విద్యార్థులు ఈరోజు ఇతర వాటిపై కాకుండా మీ చదువు పై కూడా దృష్టి పెట్టాలి.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
మిథునం:

ఈరోజు మీరు సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.మీరు చేసే పనుల్లో ఇతరుల సహాయం ఎక్కువగా ఉంటుంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడం మంచిది.
కర్కాటకం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాలను పట్టించుకోకూడదు.శత్రువులకు ఈరోజు మీరు దూరంగా ఉండటమే మంచిది.ఇతరులు మీ విషయాల్లో తలదూర్చే ప్రయత్నాలు చేస్తారు.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.
సింహం:

ఈరోజు మీరు పెట్టుబడి విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.ఎప్పటినుండో ఉన్న కోర్టు సమస్యల నుండి ఈరోజు మీరు బయటపడతారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయాలి.
కన్య:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ప్రారంభించబడిన పనులను చాలా త్వరగా పూర్తి చేస్తారు.అనుకోని చోట నుండి శుభవార్త వింటారు.కొన్ని దూరపు ప్రయాణాలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది.
తులా:

ఈరోజు మీరు కొన్ని దూరపు ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.ప్రయాణం చేసేటప్పుడు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.లేదంటే కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.మీ విలువైన వస్తువులను ఈరోజు కోల్పోయే అవకాశం ఉంది.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
వృశ్చికం:

ఈరోజు మీకు అనుకోకుండా ఖర్చులు ఎక్కువ పెరుగుతాయి.ఏ పని ప్రారంభించిన ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.కొన్ని కొన్ని చెడు సావాసాలకు ఈరోజు మీరు దూరంగా ఉండడమే మంచిది.ఇతరుల మాటలు మనసుని నొప్పిస్తాయి.
ధనస్సు:

ఈరోజు మీకు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.వ్యాపారస్తులు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వలన నష్టాలు ఎదుర్కొంటారు.ఈరోజు మీరు పని చేసే చోటా ఎంతో అనుకూలంగా ఉంటుంది.సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.
మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలను అందుకుంటారు.కుటుంబంలో అనారోగ్య సమస్యలతో సతమతమవుతారు.చికాకులు ఎక్కువగా ఉంటాయి.కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది.
కుంభం:

ఈరోజు మీరు అనవసరంగా ఇతరుల మనసులను నొప్పిస్తారు.ఎదుటివారి కోపం కుటుంబ సభ్యులపై చూపిస్తారు.అనుకోని చోటు నుండి కొన్ని శుభవార్తలు వింటారు.ప్రారంభించే పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదుర్కొనే అవకాశం ఉంది.
మీనం:

ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.కొన్ని దూరపు ప్రయాణాలు ఈరోజు మీరు వాయిదా వేసుకోవాలి.మీరు చేసే పనిలో కొన్ని ప్రమాదాలు ఎదుర్కొనే అవకాశం ఉంది.
కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.
LATEST NEWS - TELUGU