మన తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా కాడ్తల్ మండలంలోని చారికొండ గ్రామంలో వేణుగోపాలస్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి.శనివారం రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
స్వామి వారిని శుద్ధ జలం, పంచామృతాలతో అభిషేకించే ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ పుణ్య కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.
మండల పరిధిలోని చారికొండలో కొనసాగుతున్న ఉత్సవాల్లో భాగంగా శనివారం వేణుగోపాల స్వామి వారి కళ్యాణం ఉత్సవం కనుల పండగగా జరిగింది.ఈ సందర్భంగా దేవాలయాన్ని ఎంతో అందంగా అలంకరించారు.
అంతేకాకుండా మామిడి ఆకులు, కొబ్బరి, అరటి తోరణాలు వివిధ రకాల పూల తో శోభాయమానంగా దేవాలయాన్ని అలంకరించారు.
ఉదయం స్వామి వారి శుద్ధ జలం, పంచామృతాలతో అభిషేకించి ప్రత్యేక పూజలను చేశారు.వివిధ రంగుల పూలమాలలతో వేణుగోపాలస్వామి రుక్మిణి సత్యభామ అమ్మ వార్ల ఉత్సవ విగ్రహాలను అందంగా ముస్తాబు చేసి, స్వామి వారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలను సమర్పించి గ్రామంలోని ప్రధాన విధుల గుండా ఊరేగించారు.ఆ తర్వాత దేవాలయ వేద పండితులు చక్రవర్తి శ్రీనివాసాచార్యులు, కృష్ణమాచార్యులు, కిరణాచార్యులు, వేణుగోపాలచార్యుల వేద మంత్రోచ్ఛరణలు భక్తుల కరతాళ ధ్వనుల మధ్య, ముత్యాల తలంబ్రాలతో స్వామివారి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.
ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ దేవాలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు.కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్ నాయక్ సర్పంచ్ లు భారతమ్మ, లోకేశ్ నాయక్, యాదయ్య ఎంపీటీసీ రాముల గౌడు, ఉప సర్పంచ్ నరేష్ రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు శ్రీనివాసరెడ్డి, ఈవో మోహన్ రావు, నాయకులు నర్సింగ్ గౌడ్ లక్ష్మయ్య గౌడ్, భీష్మాచారి, యాదయ్య, గోపాల్, జగ్గయ్య, రాజు బాలకృష్ణ గౌడ్, లింగం, సత్యశీలా రెడ్డి, ఈశ్వర్, వెంకటయ్య, కరుణాకర్, దుర్గయ్య, కృష్ణయ్య, రమేష్, రాములు, శ్రీనివాస్ తదితరులు ఈ పుణ్య కార్యక్రమములో పాల్గొన్నారు.
DEVOTIONAL