వారంలో ఏ రోజు ఏ దేవుడికి ఏ విధంగా పూజ చేయాలో కొందరు అయోమయంలో ఉంటారు.ఏ వారం ఏ దేవునికి ప్రీతికరమైనది.ఆ దేవునికి ఏ విధంగా పూజ చేయాలి? అలా చేయడం వల్ల కలిగే లాభాలు ఏమిటి అనేది ఇక్కడ తెలుసుకుందాం.
ఆదివారం:

ఆదివారం సూర్యునికి ఎంతో ప్రీతికరమైన రోజు.ఈరోజు సూర్య దేవుని ఆరాధించడం వల్ల ఆరోగ్యంతోపాటు జ్ఞాపక శక్తి పెరుగుతుంది.ఏ శుభకార్యం తలపెట్టినా నిర్విఘ్నంగా సాగుతుంది.
సూర్యభగవానునికి తెల్లటి ధాన్యమును.సమర్పించి పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.
సోమవారం:

సోమవారం అంటే చంద్రునికి సంబంధించిన వారం.సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైన రోజు.సోమవారం శివునికి మారేడు, బిల్వ దళాలతో పూజించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయి.సిరి సంపదలు కలగాలని కోరుకునేవారు శివుని పూజించడం వల్ల వారికి సంపదలు కలుగుతాయి.
మంగళవారం:

మంగళవారం ఆంజనేయ స్వామిని, దుర్గామాతని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.ఆరోగ్య సమస్యలు తగ్గేందుకు మంగళవారం ఖాళీ మాతను పూజించాలి.ఆంజనేయస్వామికి తమలపాకుల మాల, వడ మాలలతో అర్చన చేస్తే భయాలు, రోగాలు పోతాయని శాస్త్రం చెబుతోంది.
బుధవారం:

బుధవారం వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన రోజు.బుధవారం వినాయకుడికి ఎర్ర మందారాలతో పూజించడంవల్ల అనుకున్న కార్యాలు నెరవేరుతాయి.చక్కటి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది.
గురువారం:

గురువారం గురుగ్రహాన్ని, సాయిబాబాను పూజించాలి.సాయిబాబాను పూజించే వారు గురువారం పాల పదార్థాలతో నైవేద్యం సమర్పించాలి.పసుపు రంగు వస్త్రాలను దానం చేయడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి.
శుక్రవారం:

శుక్రవారం మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన రోజు.అదే విధంగా శుక్రవారం తులసి పూజ, గోపూజలు మంచి శుభ ఫలితాలను కలిగిస్తాయి.ఈరోజు ఇష్టదైవాన్ని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి.అమ్మవారికి ఎరుపు రంగు పూలతో పూజ చేయాలి.