గోదావరి నది తీరాన వెలసిన ఖానాపూర్ మండలంలోని బదనాకుర్తి దత్తాత్రేయ స్వామి వారి వార్షికోత్సవ ఉత్సవాలు ఎంతో వైభవంగా జరిగాయి.బౌద్ధమతం సైతం బాదనకుర్తి నుంచి ప్రపంచానికి వ్యాప్తి చెందిందని పుస్తకాలలో రాసి ఉంది.
పురాతన చరిత్ర నేపథ్యమున్న దేవాలయంలో దత్తాత్రేయుని జాతరను ఎంతో ఘనంగా దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా వైభవంగా చేశారు.బాధనాకుర్తి చింతలపేట గ్రామానికి చెందిన యువకులు పలువురు భక్తులు దత్తాత్రేయుని దీక్షలు స్వీకరించి శ్రీ గురు దత్త జై గురుదత్త నామస్మరణతో గ్రామమంతా మార్మోగిపోయింది.
స్వామి వారి ఆవరణలో జాతర మధ్యాహ్నం 12 గంటలకు భక్తులకు అన్నదానం దేవాలయం కమిటీ సభ్యులు అందరూ కలిసి చేశారు.
చాలా సంవత్సరాల క్రితం ఈ దేవాలయంలో 2300 సంవత్సరాలు నాటి దత్త పాదుకలు మాత్రమే ఉండేవి.
కాలం మారుతున్న కొద్ది బాధనాకుర్తి చింతలపేట గ్రామస్తులు దత్తాత్రేయుని దేవాలయాన్ని నిర్మించారు.ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం ఉత్సవాలు క్రమం తప్పకుండా ఎంతో వైభవంగా, ఘనంగా చేస్తున్నారు.
పాదుకా క్షేత్రమైన బాధను గుర్తుకి ఘనమైన చరిత్ర ఉంది అని అక్కడి స్థానికులు చెబుతూ ఉంటారు.చరిత్రకారులు సైతం ఈ ప్రాంతాన్ని దర్శించి దేవాలయ విశిష్టతను ప్రజలకు చెబుతూ ఉంటారు.
మన తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యావేత్త చుక్క రామయ్య, విశ్రాంతడి జీవి పేరు వారం రాములు, శాసనసభ మాజీ స్పీకర్ మధుసూదనాచారి, చరిత్రకారులతో మల్లెపల్లి లక్ష్మయ్య, ఈ ప్రాంతాన్ని దర్శించి బుధవారం ఏర్పాటుకు కృషి చేస్తామని వేరు వేరు సందర్భాల్లో బాదనకుర్తి గ్రామాన్ని సందర్శించారు.
ప్రతి సంవత్సరం జాతర రోజున దేవాలయంలో ప్రత్యేక పూజలు, స్వామివారికి భక్తులు నిలువెత్తు బంగారు సమర్పిస్తారు.చెల్లింపులు దాతల సాయంతో ప్రతి సంవత్సరం మహా అన్నదానం కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు.ఈ సంవత్సరం సైతం అన్నదానానికి దాతలు ముందుకు వచ్చి సహాయం చేశారని దేవాలయ కమిటీ సభ్యులు వెల్లడించారు.