రక్తపోటు అనేది పెరిగిన ప్రమాదమే.తగ్గినా ప్రమాదమే.
చాలా మంది హై బీపీ తో బాధపడుతూ.దానిని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.
అలాగే లో బీపీ( Low BP ) తో బాధపడే వారు కూడా ఎందరో ఉన్నారు.రక్తపోటు బాగా పడిపోతే తల తిరగడం, కళ్లు మసక బారడం, త్వరగా అలసిపోవడం, వికారం, వాంతులు, తలనొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, పల్సర్ రేటు పడిపోవడం తదితర లక్షణాలన్నీ కనిపిస్తుంటాయి.
ఈ క్రమంలోనే లో బీపీ నుంచి బయటపడేందుకు మందులు వాడుతుంటారు.కానీ ఇప్పుడు చెప్పబోయే ఆహారాలను డైట్ లో చేర్చుకుంటే మందులు వాడక్కర్లేదు.
సహజంగానే రక్తపోటును అదుపులోకి తెచ్చుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుందాం పదండి.
బీట్ రూట్.లో బీపీ సమస్యను నివారించడానికి అద్భుతంగా సహాయపడుతుంది.ప్రతి రోజు ఒక గ్లాసు బీట్ రూట్ జ్యూస్( Beetroot Juice ) ను తీసుకుంటే రక్తపోటు అదుపులోకి రావడమే కాదు శరీరానికి అవసరమయ్యే ఎన్నో విలువైన పోషకాలు లభిస్తాయి.

లో బీపీ ని నివారించడానికి పొద్దుతిరుగుడు విత్తనాలు( Sunflower Seeds ) కూడా సహాయపడతాయి.రోజుకు రెండు టేబుల్ స్పూన్లు పొద్దుతిరుగుడు విత్తనాలు తీసుకోండి.ఇలా చేస్తే రక్తపోటు అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
అలాగే లో బీపీ సమస్యతో పడుతున్న వారు డైట్ లో చిలకడ దుంపలు చేర్చుకోండి.బ్లడ్ ప్రెజర్ ను అదుపులోకి తేవడానికి ఇవి చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తాయి.

అలాగే ఓట్స్, చేపలు, వెల్లుల్లి, డార్క్ చాక్లెట్, అవిసె గింజలు, పిస్తా పప్పు, ఆకు కూరలు, దానిమ్మ, అరటి, అవకడో, వంటి పండ్లు కూడా లో బీపీ సమస్యను నివారించడానికి గ్రేట్ గా సహాయపడతాయి.కాబట్టి లో బీపీ తో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ ఆహారాలను డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.







