ఉడికించిన వేరుశెన‌గ‌లు తింటున్నారా? మ‌రి మీకీ విషయాలు తెలుసా?

వేరుశెన‌గ‌లు.వీటినే కొంద‌రు ప‌ల్లీలు అని కూడా పిలుస్తుంటారు.ప్ర‌పంచ‌వ్యాప్తంగా విస్తృతంగా తినే ఆహారాల్లో ఇవి ఒక‌టి.ముఖ్యంగా స్నాక్స్‌గా పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా చాలా మంది వేయించిన వేరుశెన‌గ‌ల‌నే తింటుంటారు.మంచి రుచిని క‌లిగి ఉండే వేరుశెన‌గ‌ల్లో కాల్షియం, ఐర‌న్‌, పొటాషియం, మెగ్నీషియం, విట‌మిన్ బి, విట‌మిన్ ఇ, నియాసిన్‌, ఫైబ‌ర్‌, ప్రోటీన్‌, అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్‌, మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్‌ వంటి పోష‌కాలెన్నో కూడా నిండి ఉంటాయి.అందుకే ఇవి ఆరోగ్య ప‌రంగా బోలెడ‌న్ని లాభాల‌ను చేకూరుస్తాయి.

 Health Benefits Of Boiled Peanuts! Health, Benefits Of Boiled Peanuts, Boiled Pe-TeluguStop.com

అయితే వేయించిన వేరుశెన‌గ‌ల కంటే ఉడికించిన వేరుశెన‌గ‌లే ఆరోగ్యానికి ఎక్కువ ప్ర‌యోజ‌నాలు అందిస్తాయ‌ని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.ముఖ్యంగా రోజూ గుప్పెడు ఉడికించిన వేరుశెన‌గ‌ల‌ను తీసుకుంటే నీర‌సం, అల‌స‌ట వంటి స‌మ‌స్య‌లు దూర‌మై శ‌రీరం చురుగ్గా, ఉత్సాహంగా త‌యార‌వుతుంది.

వ్యాయామాలు చేసిన ఉడికించిన వేరుశెన‌గ‌లు తీసుకుంటే ఫుల్ యాక్టివ్‌గా మార‌తారు.అలాగే గ‌ర్భిణి స్త్రీలు రోజూ ఉడికించిన వేరుశెన‌గ‌ల‌ను తింటే ఫోలిక్‌ యాసిడ్ పుష్క‌లంగా ల‌భించి క‌డుపులోని శిశువు ఎదుగుద‌ల మెరుగ్గా మారుతుంది.

బాగా ఒత్తిడిగా ఉన్న స‌మ‌యంలో ఒకే ఒక క‌ప్పు ఉడికించిన వేరుశెన‌గ‌ల‌ను తీస‌కోవాలి.త‌ద్వారా ఒత్తిడి చిత్తు చిత్తు అవ్వ‌డంతో పాటు త‌ల‌నొప్పి, ఆందోళన, డిప్రెషన్ వంటి మాన‌సిక స‌మ‌స్య‌లు సైతం తగ్గుతాయి.

సంతాన‌ లేమితో బాధ ప‌డే దంప‌తులు ఉడికించిన వేరుశెన‌గ‌ల‌ను రోజూ తింటే లైంగిక స‌మ‌స్య‌లు త‌గ్గు ముఖం ప‌ట్టి సంతానం క‌లిగే అవ‌కాశాలు పెరుగుతాయి.

అంతే కాదు, రోజూ ఉడికించిన వేరుశెన‌గ‌ల‌ను తింటే హెయిర్ ఫాల్ స‌మ‌స్య‌కు అడ్డు క‌ట్ట ప‌డుతుంది.శ‌రీర బ‌రువు అదుపు త‌ప్ప‌కుండా ఉంటుంది.దంతాలు, ఎముక‌లు, కండ‌రాలు దృఢంగా గ‌ట్టిగా మార‌తాయి.

ఇక‌ ఎదిగే పిల్ల‌ల‌కు కూడా ఉడికించిన వేరుశెన‌గ‌ల‌ను పెడితే వారి ఆరోగ్యానికి చాలా మంచిద‌ని అంటున్నారు వైద్య నిపుణులు.

Health Benefits Of Boiled Peanuts! Health, Benefits Of Boiled Peanuts, Boiled Peanuts, Peanuts, Health Tips, Good Health, Latest News, - Telugu Benefitsboiled, Boiled Peanuts, Tips, Latest, Peanuts

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube