సంవత్సరం పొడవునా బొప్పాయి( Papaya ) మార్కెట్లో లభిస్తూ ఉంటుంది.ప్రతిరోజు రోజు ఉపాధి తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఎందుకంటే బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు మినరల్స్ ఎక్కువగా ఉంటాయి.ఈ పండులోని ఎంజైమ్ శరీరంలోని చెడు కొలెస్ట్రాలను తగ్గిస్తుంది.
ఇప్పుడు బొప్పాయి డైట్ గురించి తెలుసుకుందాం.బొప్పాయి డైట్ ను కొన్ని రోజులు పాటిస్తే అది శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ముఖ్యంగా చెప్పాలంటే ఈ డైట్( Diet ) ను ఐదు రోజుల కంటే ఎక్కువ పాటించకూడదు.ఈ డైట్ ఐదు రోజులు పాటిస్తే తర్వాత రెండు కేజీల బరువు తగ్గడంతో పాటు కాలయం, కిడ్నీ వంటి ముఖ్యమైన అవయవాలలోని టాక్సిన్స్ తొలగిపోయి, పొత్తికడుపులో కొవ్వు దూరం అవుతుంది.బొప్పాయి డైట్ లో మొదటి రెండు రోజులు కష్టతరమైనవి.ఎందుకంటే మొదటి రెండు రోజులు శరీరాన్ని శుభ్రపరచుకోవడం పై దృష్టి పెట్టడం మంచిది.ఈ రోజుల్లో మీకు కావాల్సిన బొప్పాయి తినడం మరియు చాలా నీరు త్రాగడం మాత్రమే చేయాలి.
చివరి మూడు రోజులు ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక నిమ్మకాయ రసాన్ని పిండి దానికి ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ నూనెను వేసి ఖాళీ కలుపుతూ తాగాలి.
అలాగే ఉదయం నిద్ర లేవగానే నిమ్మరసం తాగిన 30 నిమిషాల తర్వాత మీకు నచ్చిన ఏదైనా తృణధాన్యాలు, పెరుగు మరియు బొప్పాయితో కలిపి అల్పాహారంగా తీసుకోవాలి.అలాగే మధ్యాహ్నం ఒక గిన్నె తరిగిన బొప్పాయి, ఒక టేబుల్ స్పూన్ తేనెతో అల్పాహారం గా భోజనం తర్వాత తీసుకోవాలి.
చివరి మూడు రోజులు మధ్యాహ్నం మరియు సాయంత్రం తక్కువ క్యాలరీల ఆహారాలను తీసుకోవడం మంచిది.

కూరగాయల సూప్( Vegetable Soup ), ఆవిరితో ఉడికించినా కూరగాయలు, పప్పులు, సలాడ్ మరియు చేపలను లేదా చికెన్.అంతే కాకుండా శరీరం నుండి విషయాన్ని బయటకు పంపడానికి ఇది కఠినమైన ఆహారమని గుర్తించుకోవాలి.అందుకోసమే ఈ ఆహారాన్ని నియమాలను ఐదు రోజులకు మించి పాటించకూడదు.
ఈ రకమైన బొప్పాయి డైట్ అనుసరిస్తున్నప్పుడు కొంతమందికి జీర్ణ సమస్యలు( Digestion Problems ), తలనొప్పి మరియు అలసట లాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి.ఈ సమస్యలు సాధారణంగా ఉంటే ఏమి కాదు కానీ ఎక్కువగా ఉంటే త్వరగా వైద్యుని సంప్రదించడం మంచిది.