అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుంచి తన కొలువులో భారతీయులకు( Indians ) పెద్దపీట వేస్తున్న సంగతి తెలిసిందే.ఆయన అధికార యంత్రాంగంలో దాదాపు 150 మంది వరకు భారత మూలాలున్న వారు పనిచేస్తున్నారు.
తాజాగా ఇండో అమెరికన్ మహిళ నీరా టాండన్‌ను తన పాలసీ అడ్వైజర్‌గా నియమిస్తున్నట్లు తెలిపారు జో బైడెన్.( Joe Biden ) తన దేశీయ విధాన ఎజెండాను రూపొందించడంతో పాటు అమలు చేయడంలో నీరా ఆయనకు సలహాలు ఇస్తారని బైడెన్ తెలిపారు.
ఎకనమిక్ మొబిలిటీ, జాతి సమానత్వం, ఆరోగ్య సంరక్షణ, వలసలు, విద్య వంటి వాటిలో నీరాకున్న అనుభవం ఉపయోగపడుతుందని ఆయన ఆకాంక్షించారు.ఇప్పటి వరకు ఈ స్థానంలో సుసాన్ రైస్ విధులు నిర్వర్తించారు.
కాగా.తొలి నుంచి పదుల సంఖ్యలో భారతీయులకు విజయవంతంగా పదవులు కట్టబెట్టిన జో బైడెన్‌కు ఒక్క నీరా టాండన్ విషయంలోనే ఎదురుదెబ్బ తగిలింది.భారత మూలాలున్న నీరాను 2021 మార్చిలో వైట్‌హౌస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ డైరెక్టర్‌గా ఆమెను బైడెన్ నామినేట్ చేశారు.అయితే, నీరా గతంలో డెమొక్రాటిక్, రిపబ్లిక్ నేతలను విమర్శిస్తూ ట్వీట్లు చేశారు.
ఇవే ఆమె కొంప ముంచాయి.దీంతో నీరా నియామకాన్ని కేబినెట్ మంత్రులు, డెమొక్రాటిక్, రిపబ్లికన్ చట్టసభ సభ్యులు వ్యతిరేకించారు.

గతంలో ఆమె చేసిన ‘పక్షపాత’ వ్యాఖ్యల విషయమై డెమొక్రాట్ సెనేటర్ జో మాంచిన్( Democrat Senator Joe Manchin ) .తాను నీరాకు మద్దతుగా ఓటు వేయబోనని తేల్చి చెప్పారు.మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ ఆఫీస్ డైరెక్టర్‌గా నీరా టాండన్( Neera Tandon ) నామినేషన్‌ను తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు మాంచిన్ స్పష్టం చేశారు.డెమొక్రాటిక్, రిపబ్లికన్ పార్టీల నాయకులపై ఆమె గతంలో చేసిన దురుసు వ్యాఖ్యల చరిత్రను ఈ సందర్భంగా మాంచిన్ గుర్తు చేశారు.
ఈ ధోరణి ఎంతో ప్రమాదకరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.నీరా టాండన్ పక్షపాత ప్రకటనలు కాంగ్రెస్ సభ్యులకు, బడ్జెట్ కార్యాలయం , డైరెక్టర్ పని సంబంధాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని అభిప్రాయపడ్డారు.

ఇదే సమయంలో బడ్జెట్ చీఫ్‌గా ఆమె నియామకంపై మద్దతు కూడగట్టడంలో బైడెన్ కేబినెట్ విఫలమైంది.నీరా టాండన్ నియామకాన్ని ధ్రువీకరించడానికి అవసరమైన ఓట్లు సెనేట్‌లో పొందడం అసాధ్యమని తేలిపోవడంతో ఆమె నియామకంపై బైడెన్ వెనక్కి తగ్గారు.గత్యంతరం లేని పరిస్దితుల్లో నీరా టాండన్ వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ (ఓఎంబీ) డైరెక్టర్ పదవికి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నట్టుగా అధ్యక్షుడికి లేఖ రాశారు.తన నియామకాన్ని ధ్రువీకరించేందుకు అధ్యక్ష కార్యాలయం, భారతీయ సమాజం ఎంతో కష్టపడ్డారని.
కానీ పరిస్ధితులు మాత్రం తనకు అనుకూలంగా లేవని నీరా టాండన్ ఆవేదన వ్యక్తం చేశారు.అయితే తనపై ఆమె పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు బైడెన్.నీరా టాండన్‌ను వైట్‌హౌస్ స్టాఫ్ సెక్రటరీగా నియమించారు.వైట్‌హౌస్ స్టాఫ్ సెక్రటరీ వింగ్‌లో అది కీలకమైన పదవి.
పరిపాలనా యంత్రాంగంతో పాటు ఫెడరల్ ప్రభుత్వం నుంచి అధ్యక్షుడికి వచ్చే పత్రాలను ఈ విభాగం నిర్వహిస్తుంది.