రామ్ చరణ్ తో తీసే మూవీ పక్కా హిట్.. మెగా ఫ్యాన్స్ కు బుచ్చిబాబు హామీ ఇదే!

టాలీవుడ్ మెగా హీరో రామ్ చరణ్, బుచ్చి బాబు(buchi babu, ram charan) కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెల కొన్నాయి.

 Buchi Babu Sana Intresting Comments On Ram Charan Movie, Buchi Babu, Ram Charan,-TeluguStop.com

ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ (Janhvi Kapoor)హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం ఆర్సీ 16 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా రూపొందుతోంది.

ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది.ఇది ఇలా ఉంటే తాజాగా నటుడు బ్రహ్మాజీ ప్రధానపాత్రలో తెరకెక్కిన బాపు చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కు ముఖ్య అతిథిగా బుచ్చిబాబు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామ్‌ చరణ్‌ సినిమాపై ఆయన ఆసక్తికర కామెంట్‌ చేశారు.

Telugu Buchi Babu, Game Changer, Ram Charan, Tollywood-Movie

ఈ సందర్భంగా బుచ్చిబాబు(Buchi babu) మాట్లాడుతూ.మా నాన్న చాలా కష్టపడి మమ్మల్ని పెంచారు.ఆయన మా నుంచి భౌతికంగా దూరమై ఏడాది అవుతోంది.

ఉప్పెన సినిమా విడుదల సమయంలో ఆయన చేసిన పని ఇంకా గుర్తుంది.థియేటర్‌ గేట్‌ బయట నిలబడి సినిమా బాగుందా అని వచ్చిన వారందరినీ అడిగేవారట.

ఆయన సినిమా కూడా చూడకుండా థియేటర్‌ కు వచ్చిన వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.నేను ప్రస్తుతం తీస్తున్న రామ్‌ చరణ్‌(Ram Charan) సినిమా బాగుందా అని ఎవరినీ అడగాల్సిన అవసరం లేదు.

ఎందుకంటే అది కచ్చితంగా హిట్ అవుతుంది అని తెలిపారు.

Telugu Buchi Babu, Game Changer, Ram Charan, Tollywood-Movie

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను ఫ్యాన్స్‌ షేర్‌ చేస్తున్నారు.రామ్‌ చరణ్ హీరోగా ఇటీవల వచ్చిన గేమ్‌ ఛేంజర్‌(Game changer) ఆశించిన స్థాయిలో అలరించలేకపోవడంతో ఆయన అభిమానులు Rc 16పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.తాజాగా బుచ్చిబాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాటు ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

బుచ్చి బాబు తన కామెంట్స్ తో ఈ సినిమాపై అంచనాలను పెంచేశారు.ఈ సినిమాకు సంబంధించి తరచూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది.

ఈ సినిమాకు సంబంధించి వినిపిస్తున్న ఒక్కొక్క వార్తా కూడా సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి.మరి ఈ సినిమా విడుదల అయ్యి ఎలాంటి అంచనాలను అందుకుంటుందో చూడాలి మరి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube