టాలీవుడ్ ఇండస్ట్రీలోని సీనియర్ హీరోలలో చిరంజీవికి(Chiranjeevi) ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.సీనియర్ హీరోలలో చిరంజీవి ఏకంగా 70 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకున్నారు.
చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర (Vishwambhara)సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.చిరంజీవి అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కనుండగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.
మెగాస్టార్ చిరంజీవి ఐ బ్యాంక్ బ్లడ్ బ్యాంక్(Megastar Chiranjeevi’s Eye Bank Blood Bank) ద్వారా తన వంతు సేవా కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.తన సంపాదనలో కొంత మొత్తాన్ని కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం కోసం చిరంజీవి ఖర్చు చేస్తున్నారు.
అయితే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన మణిశర్మ చిరంజీవి(Mani Sharma Chiranjeevi) బ్లడ్ బ్యాంకులో బ్లడ్ డొనేట్ చేయడం గమనార్హం.మణిశర్మ రక్తదానం చేయడం ద్వారా సమాజ సేవకు తన వంతు తోడ్పాటు అందించి ప్రశంసలు అందుకుంటున్నారు.

చిరంజీవి మణిశర్మ కాంబినేషన్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి.కొత్త మ్యూజిక్ డైరెక్టర్ల జోరు వల్ల మణిశర్మకు మూవీ ఆఫర్లు తగ్గాయి. చిరంజీవి కొరటాల శివ (Chiranjeevi Koratala Siva)కాంబినేషన్లో తెరకెక్కిన ఆచార్య సినిమాకు కూడా మణి శర్మ మ్యూజిక్ అందించారు.అయితే ఆచార్య సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించకపోవడం మణిశర్మకు మైనస్ అయింది.

మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మకు ప్రస్తుతం అడపాదదపా ఆఫర్లు వస్తున్నా మరీ ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు అయితే రావడం లేదు.మణిశర్మ కొడుకు మహతి స్వరసాగర్ కొన్ని క్రేజీ ప్రాజెక్టులకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశారు.చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీత దర్శకునిగా వ్యవహరించారు.చిరంజీవి మణిశర్మ కాంబోలో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.







