వింట‌ర్‌లో ఉబ్బ‌సం రోగులు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఇవే!

వింట‌ర్ సీజ‌న్ రానే వ‌చ్చింది.రోజురోజుకు ఉష్టోగ్ర‌త‌లు త‌గ్గుతుండ‌డంతో.

చ‌లి క్ర‌మ‌క్ర‌మంగా పెరుగుతోంది.

అయితే మిగిలిన సీజ‌న్ల‌తో పోలిస్తే.

ఈ వింట‌ర్ సీజ‌న్‌లో ఉబ్బ‌సం రోగులు ఎంతో జాగ్ర‌త్త‌గా ఉండాలి.ఎందుకంటే, ఈ సీజ‌న్‌లో ఉబ్బ‌సం ల‌క్ష‌ణాలు అంటే.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శ్వాసకోశ వాపు, ద‌గ్గు, ఛాతి బిగుతుగా మారి పోవ‌డం, గుర‌క వంటివి అధిక‌మై తీవ్రంగా ఇబ్బంది పెడ‌తాయి.అందుకే ఈ వింట‌ర్‌లో ఉబ్బ‌సం రోగులు ఖ‌చ్చితంగా కొన్ని జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని.

Advertisement

త‌ద్వారా ఆయా వ్యాధి ల‌క్ష‌ణాల‌ను అదుపులో ఉంచుకోవ‌చ్చ‌ని నిపుణులు సూచిస్తున్నారు.మ‌రి ఆ జాగ్ర‌త్త‌లు ఏంటో ఓ లుక్కేసేయండి.

చ‌లి కాలంలో ఉబ్బ‌రం ల‌క్ష‌ణాల‌ను కంట్రోల్ చేయ‌డంలో అల్లం అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.ముఖ్యంగా శ్లేష్మాన్ని తొల‌గించి శ్వాస ఇబ్బందుల‌కు అడ్డు క‌ట్ట వేస్తుంది.

అందుకే ప్ర‌తి రోజు ఉద‌యాన్నే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో ఒక స్పూన్ అల్లం ర‌సం క‌లుపుకుని సేవించాలి.

ఉబ్బ‌సం రోగులు ఈ వింట‌ర్‌లో ప్ర‌తి రోజు సిట్ర‌స్ పండ్ల‌ను తీసుకోవాలి.త‌ద్వారా వాటిల్లో ఉండే విట‌మిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఇమ్యూనిటీ ప‌వ‌ర్‌ను పెంచి ఉబ్బ‌రం ల‌క్ష‌ణాల‌ను త‌గ్గిస్తాయి.సిట్ర‌స్ పండ్లే కాకుండా తాజా కూర‌గాయ‌లు, తృణ‌ధాన్యాలు, చేప‌లు, గుడ్లు వంటి డైట్‌లో చేర్చుకోండి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

అలాగే ఉబ్బసం బాధితులు రెండు రోజుల‌కు ఒక సారి యూక‌లిప్ట‌స్ ఆయిల్ వేసిన నీటితో ఆవిరి ప‌ట్టుకోవాలి.దాంతో శ్వాస మార్గంలో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి.మ‌రియు శ్వాస‌కోశ వాపు త‌గ్గు ముఖం ప‌డుతుంది.

Advertisement

ఇవే కాకుండా.వింట‌ర్‌లో ఉబ్బ‌సం రోగులుకెఫిన్ ఉండే కాఫీ, టీల‌ను తీసుకోవ‌డం త‌గ్గించాలి.

మ‌ధ్య‌పానం, ధూమ‌పానం అల‌వాట్ల‌ను నివారించుకోవాలి.రెగ్యుల‌ర్‌గా చిన్ చిన్న వ్యాయామాలు చేయాలి.

వాట‌ర్ ఎక్కువ‌గా సేవించాలి.పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలి.

ఫ‌స్ట్ ఫుడ్స్‌, ఆయిలీ ఫుడ్స్‌, ప్యాక్డ్ ఫుడ్స్ తీసుకోవ‌డం పూర్తిగా మానేయాలి.దుమ్ము.

ధూళికి దూరంగా ఉండాలి.మ‌రియు ఇన్హేలర్‌ను ఎప్పుడూ దగ్గ‌రే ఉంచుకోవాలి.

తాజా వార్తలు