ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ మంచి సక్సెస్ అందుకొని అనంతరం సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఛాన్స్ కొట్టేసినటువంటి వారిలో నటుడు సుహాస్( Suhas ) ఒకరు.ఈయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో కొనసాగుతూనే అనంతరం హీరోగా సినిమా అవకాశాలను అందుకున్నారు.
ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నటువంటి సుహాస్ ఇటీవల ప్రసన్న వదనం( Prasanna Vadanam ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ చిత్రం ఎంతో మంచి విజయాన్ని అందుకుంది.ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈయనకు పొలిటికల్ గురించి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి.ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎలక్షన్ హీట్ పెరిగిపోయిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈ ఎలక్షన్ ఎఫెక్ట్ మీ వరకు వచ్చిందా అనే ప్రశ్న సుహాస్ కి ఎదురయింది.ఈ ప్రశ్నకు ఈయన ఆసక్తికరమైనటువంటి సమాధానం చెప్పారు.
ఒకసారి మా మేనేజర్ నాకు ఫోన్ చేసి సర్ ఓ పార్టీ వాళ్లు మీరు ప్రచారానికి( Election Campaign ) వెళ్తే భారీగా డబ్బు ఇస్తామని ఆఫర్ చేశారు అంటూ ఫోన్ చేశారు.ఏంటి నేను ప్రచారానికి వెళ్లాలని ఫోన్ చేశారా అని అడగడంతో అవును సార్ అని చెప్పగా నేను సినిమా ఈవెంట్ లోనే సరిగా మాట్లాడలేను అలాంటిది రాజకీయ ప్రచారాలకు వెళ్లి ఏం మాట్లాడగలను.ఒకవేళ వెళ్లిన ఇలాంటివన్నీ తీసుకొచ్చారు ఏంటి అని అందరూ తిట్టుకుంటారు.అందుకే నాకు ఈ ఆఫర్ వద్దని నో చెప్పాను అంటూ సుహాస్ తెలిపారు.భవిష్యత్తులో ఏమైనా ఇలాంటి రాజకీయ ప్రచారాలు లేదంటే రాజకీయాలలోకి ( Politics ) వెళ్లడం అనేది జరుగుతుందా అని ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని తనకు రాజకీయాలలో ఎలాంటి అనుభవం లేదని తెలిపారు.అయితే ఏ పార్టీ వాళ్ళు ఆఫర్ ఇచ్చారని మాత్రం చెప్పలేదు.