పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకోవడం సులువైన విషయం కాదు.అయితే ప్రస్తుతం ప్రభాస్( Prabhas ) బన్నీలకు( Bunny ) మాత్రమే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే.
అయితే ప్రభాస్ బన్నీ తర్వాత ఆ స్థాయి ఎవరిది అనే చర్చ జరుగుతోంది.గేమ్ ఛేంజర్( Game Changer ) మూవీ హిట్టై ఉంటే ఈ ప్రశ్నకు సులువుగా సమాధానం అయితే దొరికేదని చెప్పవచ్చు.
అయితే గేమ్ ఛేంజర్ ఫ్లాప్ కావడంతో ఈ ప్రశ్నకు జవాబు దొరకడం లేదు.
ప్రస్తుతానికి ప్రభాస్ బన్నీ తర్వాత స్థానం జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) దని చెప్పవచ్చు.
పవన్, చరణ్, మహేష్ తర్వాత స్థానాల్లో ఉన్నారు.అయితే తర్వాత సినిమాల ఫలితాలను బట్టి ఈ జాబితా మారితే అవకాశం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ప్రభాస్, బన్నీలకు మాత్రం బాక్సాఫీస్ వద్ద తిరుగులేదని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.
ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్( The Rajasaab ) సినిమాతో బిజీగా ఉండగా బన్నీ మాత్రం త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉన్నారు.ఈ ప్రాజెక్ట్స్ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ది రాజాసాబ్ మువీ ఈ ఏడాదే థియేటర్లలో విడుదల కానుండగా ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రభాస్ క్రేజ్ సైతం మామూలుగా లేదనే సంగతి తెలిసిందే.
ప్రభాస్ తర్వాత ప్రాజెక్ట్ లపై కూడా అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.సీనియర్ హీరోలలో చిరంజీవి, బాలయ్య టాప్ లో ఉన్నారు.ఈ ఇద్దరు హీరోలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధిస్తున్నారు.
వెంకటేశ్, నాగార్జున భవిష్యత్తు సినిమాల ఫలితాలను బట్టి ఈ హీరోల రేంజ్ డిసైడ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.ప్రభాస్ ఇతర భాషల్లో సైతం సత్తా చాటితే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు.