సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ప్రజలకు అవగాహన కల్పించే సీనియర్ పోలీస్ అధికారి సజ్జనార్( Sajjanar ) తాజాగా మ్యాట్రిమోని సైట్లలో( Matrimony Sites ) జరుగుతున్న మోసాలపై హెచ్చరికలు జారీ చేశారు.మ్యాట్రిమోని వెబ్‌సైట్లు ప్రస్తుతం కేటుగాళ్లకు ప్రధాన కేంద్రంగా మారుతున్నాయని, నకిలీ ప్రొఫైల్స్( Fake Profiles ) సృష్టించి వివాహ పేరుతో భయానక మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు.
మ్యాట్రిమోని వెబ్‌సైట్లలో కేటుగాళ్లు అందమైన యువతీ, యువకుల ఫొటోలతో నకిలీ ప్రొఫైల్స్ తయారు చేస్తున్నారు.పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి బాధితులను నమ్మబలికి, వీడియో కాల్స్ చేస్తూ దారుణ మోసాలకు పాల్పడుతున్నారు.
న్యూడ్ వీడియోలు రికార్డ్ చేసి, వాటిని బ్లాక్ మెయిల్( Blackmail ) చేయడం, డబ్బు కోసం బెదిరించడం ప్రధానంగా జరుగుతోంది.న్యూడ్ వీడియోల వ్యవహారం బయటకు వస్తే పరువు పోతుందనే భయంతో బాధితులు ఫిర్యాదు చేయడానికి జంకుతున్నారు.ఈ మోసాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సజ్జనార్ సూచించారు.ఇకపోతే మ్యాట్రిమోని సైట్ల ద్వారా పరిచయమైన వ్యక్తులపై పూర్తిగా నమ్మకము పెట్టడానికి ముందే వారి వివరాలను ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలి.
ఒకవేళ వీడియో కాల్స్ చేయమన్నా లేదా న్యూడ్ ఫోటోలు పంపమని అడిగినా వెంటనే అనుమానించాలి.
ఇలాంటి మోసాలకు గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా 1930 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సజ్జనార్ తెలిపారు.సజ్జనార్ అందరినీ ఈ కొత్త తరహా మోసాల గురించి అప్రమత్తం చేస్తున్నారు.ఫిర్యాదు చేయడానికి భయపడకుండా ముందడుగు వేయాలని, పోలీసుల సహాయం పొందాలని కోరుతున్నారు.
ఇందుకు సంబంధించి పోలీసులు, సంబంధిత అధికారులు మ్యాట్రిమోని వెబ్‌సైట్లలోని నకిలీ ప్రొఫైల్స్‌ను గుర్తించి తొలగించే ప్రయత్నాలు ప్రారంభించారు.భవిష్యత్తులో ఇలాంటి మోసాలను అరికట్టేందుకు అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు.
మాటనమ్మి మోసపోకుండా అప్రమత్తంగా ఉండి, ఇలాంటి మోసాలకు వ్యతిరేకంగా ప్రజలు ముందుకు రావాలని సజ్జనార్ పిలుపునిచ్చారు.