కొబ్బరి నూనెను జుట్టుకే కాదు ఇలా కూడా వాడొచ్చని తెలుసా?

సాధారణంగా మనలో చాలా మంది జుట్టుకు కొబ్బరి నూనెను ఉపయోగిస్తారు.మార్కెట్లో ఎన్ని హెయిర్ ఆయిల్స్ ఉన్నప్పటికీ.

 Did You Know That Coconut Oil Can Be Used Not Only For Hair? Coconut Oil, Latest-TeluguStop.com

ఎక్కువ శాతం మంది కొబ్బరి నూనె( Coconut oil ) వైపే మొగ్గు చూపుతారు.జుట్టు ఆరోగ్యానికి కొబ్బరి నూనె అండగా ఉంటుంది.

అందులో ఎటువంటి సందేహం లేదు.అయితే జుట్టుకే కాదు కొబ్బరి నూనెను మనం అనేక విధాలుగా వాడుకోవచ్చు.

కొందరు డార్క్ లిప్స్( Dark lips ) తో బాధపడుతూ ఉంటారు.పెదాల నలుపును పోగొట్టేందుకు కొబ్బరి నూనె ఉపయోగపడుతుంది.

వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్‌లో రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె కలిపి పెదాలకు స్క్రబ్బర్ మాదిరి ఉపయోగించాలి.రెండు రోజులకు ఒకసారి ఇలా చేసే పెదాల నలుపు వదిలిపోతుంది.

Telugu Tips, Coconut Oil, Coconutoil, Latest, Skin Care, Skin Care Tips-Telugu H

అలాగే దంతాలపై ఏర్పడిన పసుపు మరకలను మాయం చేయగల సత్తా కొబ్బరి నూనెకు ఉంది.వన్ టేబుల్ స్పూన్ కొబ్బ‌రి నూనెలో హాఫ్ టేబుల్ స్పూన్ లవంగాల పొడి( Clove powder ) కలపాలి.ఈ మిశ్రమాన్ని ఉపయోగించి దంతాలను తోముకోవాలి.ఇలా చేయడం వల్ల దంతాలు తెల్లగా మారతాయి.

Telugu Tips, Coconut Oil, Coconutoil, Latest, Skin Care, Skin Care Tips-Telugu H

డార్క్ సర్కిల్స్‌ తో ఇబ్బంది పడుతున్న వారికి కూడా కొబ్బరి నూనె ఉపయోగపడుతుంది.రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ కు వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేస్తే ఒక క్రీమ్ సిద్ధమవుతుంది.రోజు నైట్ నిద్రించే ముందు కళ్ళ చుట్టూ ఈ క్రీమ్ ను అప్లై చేసుకుని మసాజ్ చేసుకోవాలి.దాంతో డార్క్ సర్కిల్స్ పరార్ అవుతాయిఇక తమ మెడ నల్లగా ఉందని ఎంతో మంది ఆవేదన చెందుతుంటారు.

అలాంటి వారు రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెకు వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ కలిపి మెడకు అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకోండి.ప్రతిరోజూ స్నానం చేయడానికి గంట ముందు ఈ విధంగా చేశారంటే మెడ నలుపు మాయం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube