షెల్టర్ హోమ్ నుంచి బాలికను అపహరించిన ఆరుగురు వ్యక్తులు.. వీడియో వైరల్..

గురువారం రాత్రి గ్వాలియర్‌( Gwalior )లోని ఒక షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది.ఒక బాలికల గృహం నుంచి ఆరుగురు ముసుగు వ్యక్తులు 17 ఏళ్ల అమ్మాయిని అపహరించారు.

 Six People Abducted The Girl From The Shelter Home Video Viral , Masked-men, Ab-TeluguStop.com

ఈ ఘటన కలకలం రేపింది.ఇది 2 గంటలకు ఒక స్టాప్ సెంటర్ లో చోటుచేసుకుంది.

మాస్క్ ధరించిన ఆరుగురు 4 అడుగుల ఎత్తు గోడ దాటుకొని లోపలికి ప్రవేశించారు.ఒక కర్ర సహాయంతో గార్డు గది కిటికీ ద్వారా లోపలికి వెళ్లి లోపల ఉన్న తలుపు తీశారు.

అమ్మాయిని పిలవగా ఆమె లేచింది.అనంతరం తమతో పాటు తీసుకెళ్లారు.

ఈ ఘటన 20 నిమిషాల వ్యవధిలో జరిగింది.ఆ సమయంలో ఒక మహిళా గార్డు నిద్రపోతోంది.మరో ముగ్గురు గార్డులు, ఒక పోలీసు అధికారి ప్రధాన ద్వారం వద్ద ఉన్నారు.అయితే వారికి లోపల ఏం జరుగుతోందో తెలియదు.

అమ్మాయిని అపహరించిన ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ బయటికి వచ్చింది.ఈ దృశ్యాలను బట్టి, అమ్మాయి ముసుగు ధరించిన ఒక వ్యక్తి చేతులు పట్టుకుని వెళుతున్నట్లు కనిపిస్తుంది.

పోలీసు అధికారులు అఖిలేష్ రెనవాల్, అశోక్ జాదవ్ ల ప్రకారం, అమ్మాయి ఇంతకు ముందు రెండుసార్లు ఇంటి నుంచి పారిపోయింది.ఈ ఘటనలో అమ్మాయి ప్రియుడు పాత్ర ఉండవచ్చు అని పోలీసులు అనుమానిస్తున్నారు.

వీళ్లకు ప్రదేశం గురించి పూర్తి వివరాలు తెలియడంతో ఈ ఘటన ప్రీప్లాన్డ్‌ అని పోలీసులు భావిస్తున్నారు.ఇంతకు ముందు అమ్మాయి తాతీపుర్ ప్రాంతం నుంచి మాయమైంది.

ఆ సమయంలో అమ్మాయి ప్రియుడిపై పోలీస్ స్టేషన్ లో అపహరణ కేసు నమోదు అయింది.

జూన్ 7న పోలీసులు( Police ) అమ్మాయిని కనుగొని కోర్టులో హాజరుపరిచారు.అమ్మాయి తల్లిదండ్రులతో వెళ్ళడానికి నిరాకరించడంతో కోర్టు ఆమెను బాలికల గృహానికి పంపింది.ఇంతకు ముందు ఆమె ఇంటి నుంచి పారిపోవడానికి ప్రయత్నించడంతో ఆమెను మూడవ గదిలో ఉంచారు.

అది అత్యంత లోపలి గది.ఇప్పుడు బాలికల గృహం నుంచి ఎవరైనా ఈ ఘటనలో పాత్ర పోషించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube