వైరల్ వీడియో: ఆ పెద్దాయనకు సలాం అంటున్న ఆనంద్ మహేంద్ర

ఎవరిలో ఎలాంటి టాలెంట్ ఉంటుందో సందర్భాను సారు అవే బయటికి వస్తాయి.అంతేకానీ వారి ముఖ లక్షణం, వారిని చూసి కొంతమంది తక్కువ అంచనా వేస్తూ ఉంటారు.

 Viral Video Of Anand Mahendra Saluting The Old Man, Viral Latest, Viral News, Su-TeluguStop.com

కానీ ఎవరిలో ఏ టాలెంట్ దాగి ఉందో ఎవరికి కూడా తెలియదు.అది సమయం సందర్భం వచ్చినప్పుడు వాటి అంతకవే బయటపడతాయి.

అయితే ఒక వృద్ధ ఇంజనీర్ తయారుచేసిన సైకిల్లను చూసి అందరూ ఫిదా అవుతున్నారు.వయసుతో పనేముంది టాలెంట్ ఉంటే సరిపోతుంది అన్నట్లు ఉంది ఇతని ఆవిష్కరణ.

అయితే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఆనంద్ మహేంద్ర( Anand Mahendra ) కూడా అతని టాలెంట్ కి ఫిదా అయ్యాడు అంటే నమ్మండి.ఆ వృద్ధ ఇంజనీర్ తయారుచేసిన సైకిల్లను చూసి ఆనంద్ మహేంద్ర సోషల్ మీడియా ద్వారా తన భావనను వ్యక్తం చేశారు.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.గుజరాత్( Gujarat ) కు చెందిన సుదీర్ భావే అనే వ్యక్తి ఒక ఉక్కు పరిశ్రమలో 40 సంవత్సరాలుగా పని చేస్తూ ఇటీవల రిటైర్డ్ అయ్యారు.అయితే అతనికి సైకిల్ రూపకల్పనను ప్రవృత్తిగా ఎంచుకొని తన అభిరుచి మేరకు సైకిల్లను తయారు చేసేవాడు.ఇప్పటికే అనేక మోడల్లలో సైకిల్లను తయారు చేశాడు.ఇక ఈ విషయం కాస్త మహేంద్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత ఆనంద్ మహీంద్రా దృష్టికి వెళ్ళగా.సుధీర్ భావే నైపుణ్యాన్ని గుర్తించి అతను తయారు చేసిన కొన్ని మోడల్ల సైకిల్లను అన్నిటినీ ఒక వీడియో తీసి సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

ఆనంద్ మహేంద్ర సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ సుధీర్ భావే ( Sudhir Bhave )అణచివేయలేని సృజనాత్మకత శక్తికి నేను నమస్కరిస్తున్నాను.భారతదేశంలో ఆవిష్కరణలు, స్టార్టప్ డీఎన్‌ఏ అనేది యువతకు మాత్రమే ప్రత్యేక హక్కు కాదని సుధీర్ నిరూపించాడు.

సుధీర్, నువ్వు ‘రిటైర్డ్ కాదు.’ మీరు మీ జీవితంలో అత్యంత చురుకైన, వినూత్నమైన కాలంలో ఉన్నారు” అంటూ ఇలా రాసుకు వచ్చాడు.

ఇది ఇలా ఉండగా.మరొక ఆశ్చర్యపరమైన విశేషం ఏమిటంటే., ఆనంద్ మహేంద్ర ఆ రిటైర్డ్ ఉద్యోగికి ఒక మంచి ఆఫర్ కూడా ఇచ్చారు.మీరు మీ ప్రయోగాల కోసం మా వడోదర ఫ్యాక్టరీ యొక్క వర్క్‌షాప్‌ ని ఉపయోగించాలనుకుంటే, నాకు తెలియజేయండి’ అంటూ సోషల్ మీడియాలో అతన్ని ట్యాగ్ చేశారు.

దీంతో సుధీర్ భావే సుధీర్‌ భావే తన వినూత్నమైన డిజైన్‌ లను కలిగి ఉన్న సైకిల్‌ లను తయారు చేయడం గురించి వివరించాడు.సుధీర్ బ్యాటరీ డిశ్చార్జ్ అయితే మీరు మాన్యువల్‌గా కూడా నడపగలిగే ఎలక్ట్రికల్ సైకిల్‌ను కూడా తయారు చేసారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube