తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఎందుకంటే ఆయన చేసిన సినిమాలే ఆయన్ని చాలా గొప్పగా పరిచయం చేస్తూ ఉంటాయి.
అందులో భాగంగానే ఆయన ఇప్పుడు చేస్తున్న ప్రతి సినిమా కూడా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాయి.మరి ఇలాంటి క్రమంలో ఆయన చేస్తున్న వరుస సినిమాలు ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాయి అనేది కూడా ఇప్పుడు తెలియాల్సి ఉంది.
ఇక శంకర్ దాదా జిందాబాద్ సినిమా తర్వాత ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే.ఇక అప్పటినుంచి ఆయన దాదాపు పది సంవత్సరాల పాటు సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు.
మళ్ళీ ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు.
ఇక ఆ తర్వాత కొన్ని ఫ్లాప్ లైతే వచ్చాయి.ఇక ఇప్పుడు వాల్తేరు వీరయ్య సినిమాతో( Waltair Veerayya ) మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ ఆ తర్వాత మెహర్ రమేష్ డైరెక్షన్ లో చేసిన భోళా శంకర్ సినిమా మాత్రం భారీ డిజాస్టర్ ను మూటగట్టుకుంది.అందుకే ఇప్పుడు చేస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాతో భారీ సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నాడు.
ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది.కానీ చిరంజీవి తో సినిమా చేయాలని చాలామంది దర్శకులు ఎదురు చూస్తున్నారు.
అందులో లోకేష్ కనకరాజ్ ఒకరు.ప్రస్తుతం లోకేష్ కనకరాజు రజనీకాంత్( Rajinikanth ) ను హీరోగా పెట్టి కూలీ అనే సినిమా చేస్తున్నాడు.
ఇక ఈ సినిమా తర్వాత ఆయన విక్రమ్ 2 సినిమాని తెర మీదకి తెచ్చే అవకాశాలైతే ఉన్నాయి.అలాగే బాలీవుడ్ లో అమీర్ ఖాన్ తో కూడా మరొక సినిమా చేయబోతున్నాడు అనే వార్తలైతే వస్తున్నాయి.ఇక ఇదిలా ఉంటే ఆయన చిరంజీవితో ఒక భారీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమాను తెరకెక్కించాలని చూస్తున్నాడట.నిజానికి తెలుగులో ఆయనకు చిరంజీవి అంటే చాలా ఇష్టం అని ఆయన సినిమాలు చూసుకుంటూ తను పెరిగానని చెప్పాడు.
అందువల్లే చిరంజీవితో సినిమాని చేయడానికి తొందర్లోనే ప్రణాళికలను కూడా రూపొందించుకున్నట్లుగా తెలుస్తోంది…
.