తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వరుసగా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే నాగార్జున( Nagarjuna ) లాంటి నటుడు సైతం తనదైన రీతిలో సత్తా చాటుకోవాలని అహర్నిశలు ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక నాగార్జున ఎంటైర్ కెరియర్ లో చాలా వైవిద్య భరితమైన పాత్రలను పోషిస్తూ తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు.ఆయన వందో సినిమా కోసం ఎక్స్పెరిమెంటల్ సినిమాని చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఇప్పటికే ఆయన రజనీకాంత్ కూలీ సినిమాలో( Coolie Movie ) విలన్ గా నటిస్తూ మెప్పించడానికి రెడీ అవుతున్నాడు.అలాగే కుబేర ( Kubera ) సినిమాలో ధనుష్ తో పాటు కలిసి నటించడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు.మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాలతో పాటు తన వందో సినిమాని కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలనే ఆలోచనలో తను ఉన్నట్టుగా తెలుస్తోంది.అయితే తన వందో సినిమా కోసం తమిళ్ స్టార్ డైరెక్టర్ అయిన లింగుస్వామి( Director Linguswamy ) తో ఆయన ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఇప్పటికే లింగస్వామి నాగార్జున కి ఒక కథను కూడా వినిపించారట.మరి ఆ కథకు నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.నాగార్జున తొందర్లోనే ఈ సినిమాను పట్టాలెక్కించే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.ఇక ‘నా సామిరంగ ‘ సినిమా ఫ్లాప్ తర్వాత నాగార్జున సోలో హీరోగా మరో సినిమా అయితే చేయలేదు.
ఇక తన వందో సినిమా కోసమే తీవ్రమైన కసరత్తులు చేస్తున్న సందర్భంలో కూలీ, కుబేర లాంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ మెప్పించడానికి రెడీ అయ్యాడు.మరి ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం…
.