గత కొద్ది నెలల నుంచి కరోనా మహమ్మారి ప్రపంచపై తీవ్రరూపం దాలుస్తుంది.రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.
ఒక వైపు కరోనా కేసులు పెరుగుతుండడంతో పాటు, రికవరీ రేటు కూడా పెరగడంతో కొంతమేర ప్రజలలో ఈ మహమ్మారి గురించి భయాందోళనలు చెందడం లేదు.అయితే ఈ మహమ్మారి గురించి శాస్త్రవేత్తలు నిత్యం పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు.
ఈ భయంకరమైన వ్యాధి గురించి ప్రతి రోజు ఏదో ఒక కొత్త విషయం బయట పడుతూనే ఉంది.ఈ తరహాలోనే కరోనా గురించి మరొక షాకింగ్ విషయాన్ని శాస్త్రవేత్తలు తెలియజేశారు.
కరోనా సోకిన వ్యక్తి కోలుకున్న తర్వాత కూడా వారిలో అనేక సమస్యలు చర్మ సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు.మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ జరిపిన పరిశోధన వివరాలను 29వ కాంగ్రెస్ ఆఫ్ ది యూరోపియన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ అండ్ వెనెరియాలజీలో వెల్లడించారు.
ఒకసారి కరోనా సోకిన తర్వాత కోలుకున్న వ్యక్తులు “లాంగ్ హాలర్స్” అనే చర్మ సమస్యతో బాధపడుతున్నట్లు శాస్త్రవేత్తలు తాజాగా తమ అధ్యయనంలో వెల్లడించారు.
ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు నెలల మధ్య ఈ పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు ఎక్కువ కాలం ఈ వైరస్ తో బాధ పడిన వారిలో ఇలాంటి చర్మ సమస్యలు తలెత్తాయని తెలిపారు.కేవలం కోరుకున్న వారిలో మాత్రమే కాకుండా, ఈ వ్యాధి సోకిన వారిలో కూడా ఈ చర్మ సమస్యలు ఉన్నాయని తెలిపారు.ప్రపంచంలోని 39 దేశాలలో దాదాపు 1000 మందిని పరిశీలించగా వారిలో 224 మంది ఇలాంటి చర్మ సమస్యలతో బాధపడుతున్నారు.
కరోనా సోకిన కొందరిలో కాళ్లు, చేతులు వాపు రావడం, చర్మంపై దద్దుర్లు ఏర్పడటం వంటి సమస్యలు తలెత్తాయని ఈ పరిశోధనల్లో భాగంగా శాస్త్రవేత్తలు తెలియజేశారు.