చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి వచ్చి మెగాస్టార్( Megastar ) గా తన స్టార్ డం ఇంకా కొనసాగిస్తున్నారు అయితే తన లాగా తన పిల్లలకి ఆ అవసరం లేదు.కష్టపడి పైకి ఎక్కాలని బాధ లేదు ఎందుకంటే తండ్రి ఆల్రెడీ మెగాస్టార్ కాబట్టి వారికి ఇండస్ట్రీలో ఎంట్రీ చాలా సులువుగా దొరుకుతుంది ఒకవేళ ఒకటి రెండు పరాజయాలు వచ్చినా కూడా నిలబడే అంత ధైర్యం వారికి వస్తుంది దానికి సరిపడా శక్తి వారి తల్లిదండ్రుల నుంచి అందుతుంది.
అందువల్ల మెగాస్టార్ కుటుంబంలోని చాలామంది వారసులు సినిమా ఇండస్ట్రీకి వచ్చారు.అయితే మెగాస్టార్ చిరంజీవికి మాత్రం రామ్ చరణ్( Ram Charan ) ని హీరోగా చేయాలని అనుకున్నప్పటికి, తన పెద్ద కూతురు సుస్మితను( Sushmita ) కూడా హీరోయిన్ చేయాలని అనుకున్నారట.
అలా పూరి జగన్నాథ్ కి( Puri Jagannath ) చెప్పి తన కూతురు ఎంట్రీ కోసం మంచి సబ్జెక్టు కూడా సిద్ధం చేయమని చెప్పారట.ఆయన అనుకున్నట్టుగానే ఒక కథ రెడీ చేశారట కానీ ఫస్ట్ అఫ్ చాలా బాగున్నప్పటికీ సెకండ్ హాఫ్ పెద్దగా నచ్చకపోవడంతో మళ్లీ రిపేర్ వర్క్ చేయమన్నారట.ఆ సినిమాకి ఉదయ్ కిరణ్ నీ హీరోగా అనుకుంటే సుస్మిత హీరోయిన్ గా అనుకున్నారట.అలా వీరిద్దరూ తోలుత హీరో హీరోయిన్ గా నటించాల్సి ఉంది కానీ స్క్రిప్ట్ ప్రాబ్లం తో అది అక్కడే ఆగిపోయింది.
సినిమా అయితే స్టార్ట్ అవ్వలేదు కానీ వీరిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ గట్టిగా స్టార్ట్ అయింది ఆ తర్వాత ఇద్దరు ప్రేమలో కూడా పడ్డారు పెళ్లి వరకు వెళ్లారు ఇంట్లో వారు కూడా ఒప్పుకోవడంతో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది కానీ ఉదయ్ కిరణ్ ఏ కారణాల చేత వద్దు అన్నాడో తెలియదు కానీ నిశ్చితార్థం తర్వాత పెళ్లి ఆగిపోయింది.
ఆ తర్వాత ఉదయ్ కిరణ్ జీవితం ఎలా ముగిసిపోయిందో కూడా మన అందరికీ తెలుసు.అంతకన్నా ముందే సుస్మిత ని హీరోయిన్ గా చేయడానికి మరికొన్ని సబ్జెక్ట్స్ కూడా చిరంజీవి విన్నాడట.కానీ ఆయనకు ఏమీ నచ్చకపోవడంతో ఆమె హీరోయిన్ కాలేకపోయింది.
ఆ తర్వాత కొంచెం సినిమాలు వద్దు అనుకొని పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేయగా ఆమెకి ఇప్పుడు ఇద్దరు కుమార్తెలు.కానీ సినిమా ఇండస్ట్రీపై ఆమెకు మంచి ఇంట్రెస్ట్ అయితే ఉంది వెబ్ సిరీస్ కి నిర్మాతగా కూడా వ్యవహరిస్తుంది అలాగే కాస్ట్యూమ్ డిజైనింగ్ పై మంచి పట్టు కూడా ఉంది.
తన తండ్రి చిరంజీవి నటించిన సైరా సినిమా కోసం సుస్మిత చాలా కష్టపడింది.