పురాతన ఆహార పదార్ధాలలో బెల్లం అనేది ఒకటి.పంచదార కంటే బెల్లం ఆరోగ్యానికి మంచిదని ఎక్కువగా పిండివంటలకు బెల్లాన్ని ఉపయోగిస్తున్నారు.
పంచదారతో పోలిస్తే బెల్లం తయారీలో ఉపయోగించే రసాయనాలు కూడా తక్కువే.ఆయుర్వేద వైద్యంలో బెల్లంను ఎక్కువగా వాడతారు.
ఐరన్, మెగ్నీషియం లాంటి మూలకాలు సమృద్ధిగా ఉంటాయి.ప్రతి 100 గ్రాముల బెల్లంలో 2.8 గ్రాముల మినరల్ సాల్ట్ ఉంటుంది.అదే పంచదారలో 0.3 మిల్లీ గ్రాములు కూడా ఉండదు.బెల్లంలోని మెగ్నీషియం నాడీవ్యవస్థను బలోపేతం చేయటంలో సహాయపడుతుంది.పొటాషియం కణాలలోని ఆమ్లాలని నియంత్రిస్తుంది.100 గ్రాముల బెల్లంలో 383 కేలరీలు, 95 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 80 మిల్లీ.గ్రా కాల్షియం, 40 మిల్లీ.గ్రా.పాస్ఫరస్, 2.6మి.గ్రా ఇనుము లభిస్తాయి
భోజనం తర్వాత చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది .జీవక్రియను వేగవంతం చేస్తుంది.దాంతో అజీర్ణ సమస్యలు దూరం అవుతాయి
ఒక గ్లాస్ నీటిలో కొన్ని తులసి ఆకులు, బెల్లం వేసి కలిపి త్రాగితే దగ్గు నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది
నాలుగు వెల్లుల్లి రెబ్బలు,రెండు కాకర ఆకులు, మూడు మిరియాలు,చిన్న బెల్లం ముక్క వేసి మెత్తని పేస్ట్ తయారుచేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని రోజులో రెండు సార్లు వారం పాటు తీసుకుంటే నెలసరి సమస్యల నుండి బయట పడవచ్చు
గ్లాస్ వేడి పాలలో పంచదారకు బదులు బెల్లం కలిపి త్రాగిన నెలసరి సమస్య నుండి బయట పడవచ్చు
అలాగే ఆ సమయంలో వచ్చే కడుపునొప్పి తగ్గాలంటే బెల్లం, నెయ్యి కలిపి వేడిచేసి నొప్పి ఉన్న ప్రదేశంలో పట్టు లా వేస్తె ఉపశమనం కలుగుతుంది
కడుపులో మంటగా ఉన్నప్పుడు బెల్లం మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది.
బెల్లంలో పొటాసియం సమృద్ధిగా ఉంటుంది.అందువల్ల ఇది కణాల్లో ఆమ్లాలు, అసిటోన్లపై దాడి చేసి ఆమ్ల సమతౌల్యాన్ని కాపాడుతుంది.తిన్నవెంటనే చిన్న బెల్లం ముక్క నోట్లే వేసుకుంటే సరి
చూసారుగా ఫ్రెండ్స్ ఈ చిట్కాలను పాటించి నెలసరి సమస్యల నుండి సులభంగా బయట పడండి.