Smoking cigarettes : రోజుకి 10 సిగరెట్లు తాగుతున్నారా ? నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చెప్పిన నిజాలు..

ప్రపంచ వ్యాప్తంగా ధూమపానం చేసి అనారోగ్యం బారిన పడుతున్న వారు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నారు.ఇలా చేసేవారిలో చదువు లేని వారు తక్కువగా ఉన్న, చదువు ఉన్న వారు ఎక్కువ మంది ఉన్నారు.

 Smoking 10 Cigarettes In A Day Facts Told By National Cancer Institute, Nci, S-TeluguStop.com

అంటే దీని అర్థం అన్ని తెలిసి కూడా వీరు ధూమపానం చేసి అనారోగ్య సమస్యలను తెచ్చుకుంటున్నారు.ముఖ్యంగా ఇలాంటి చెడు అలవాటు ఉన్న వారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది.

చాలామంది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ధూమపానానికి బానిసలు అవుతున్నారు.వీరిలో చాలామంది రోజుకి కనీసం 10 సిగరెట్లు అయినా తాగుతున్నారు.

కానీ వారికి తెలియని విషయమేమిటంటే అలాంటివారు వేగంగా మరణానికి దగ్గరవుతున్నట్లు అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌ ప్రకారం ఒక మనిషి రోజుకు 10 కంటే ఎక్కువ సిగరెట్లను తాగినట్లయితే మరణానికి చేరువలో ఉన్నట్లేనని ఎన్‌సీఐ వెల్లడించింది.

ప్రతిరోజు ఎక్కువ గా సీక్రెట్లు తాగినట్లయితే ప్రాణాలకు ముప్పు ఉండే అవకాశం ఉంది.కాస్త కష్టపడితే చాలు ఈ సిగరెట్ తాగే అలవాటును వదిలేయవచ్చు.ఏదైనా చెడు అలవాటు ఉంటే దాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలో అనే విషయాన్ని ఆలోచించాలి.సిగరెట్ తాగాలని అనిపించినప్పుడల్లా ఆ సమయంలో మీకు ఇష్టమైన ఆహారాన్ని తినడం మంచిది.

సిగరెట్ తాగడం మానేయాలనే సంకల్పం గట్టిగా ఉండాలి.

Telugu Amla, Cancer, Cigarettes, Ginger Powder, Problems, Tips-Telugu Health Tip

దీనితోపాటు సిగరెట్ తాగాలని అనిపించినప్పుడు బిగ్గరగా శ్వాస తీసుకుని వదలి, ఆ తరువాత నీరు త్రాగడం మంచిది.ఇలా చేయడం వల్ల కొన్ని చెడు అలవాట్లను వదిలేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.అంతే కాకుండా ఉసిరి, అల్లం పొడి తీసుకుని అందులో నిమ్మరసం, ఉప్పు కలిపి పేస్ట్ చేసి ఉంచుకోవాలి.

మీకు సిగరెట్ తాగాలని అనిపించినప్పుడల్లా ఈ పేస్ట్‌ని కొంచెం తినడం అలవాటు చేసుకోవడం వల్ల కూడా చెడు అలవాటులను దూరం చేసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube