షాకింగ్ వీడియో: కనురెప్ప పాటులో తల్లిబిడ్డలను పొట్టన పెట్టుకున్న కారు..

ప్రతినిత్యం ప్రపంచవ్యాప్తంగా పదుల సంఖ్యలో యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి.ఈ ఘటనలో అనేకమంది ప్రాణాలు కోల్పోతూ ఉండగా చాలామంది అంగవైకల్యంగా మారిపోతున్నారు.

 A Car Carrying A Mother's Child Along With Her Eyelid, Accident,viral Latest, Vi-TeluguStop.com

అయితే ఈ యాక్సిడెంట్ లకు సంబంధించి సీసీటీవీ ఫోటేజీలలో రికార్డయిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ (Viral on social media_అవుతుండడం మనం చూస్తూనే ఉంటాము.తాజాగా ఇలాంటి సంఘటన సంబంధించిన మరో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ ఘటనలో తల్లి కూతుర్లతోపాటు మరో బాలిక కూడా ప్రాణాలు కోల్పోయారు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.

ఉత్తరాఖండ్(Uttarakhand) రాష్ట్రంలో ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది.రోడ్డుపై అటుగా వెళ్తున్న ఒక కారు ముగ్గురిని బలి తీసుకుంది.ఈ ఘోర రోడ్డు ప్రమాదం సంబంధించిన భయానక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని న్యూ టెహ్రీ(New Tehri ,Uttarakhand state) ప్రాంతంలో సోమవారం నాడు ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది.

కేవలం 7 సెకన్లు ఉన్న ఈ వీడియోలో కారు ఎంత బీభత్సాన్ని సృష్టించిందో క్లియర్ గా కనబడుతుంది.

రోడ్డుకు చివరగా ఓ వీధిలో ఒక మహిళ ఇద్దరు అమ్మాయిలు నడుస్తున్నట్లుగా వీడియోలో కనబడుతుంది.అలా వారు వెళుతున్న సమయంలో వారికి ఎదురుగా అతివేగంగా వచ్చి వీధిలో నడుస్తున్న వారిపై దూసుకెళ్లింది.దాంతో ఒక్కసారిగా వారందరూ అమాంత దూరం గాలిలో ఎగిరిపడ్డారు.

ఈ దిబ్రాంతికరమైన ఘటనలో ఓ మహిళ ఇద్దరు పిల్లలు మరణించారు.ఇలాంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో రోడ్లపై నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube