మంగళవారం వైసీపీ అధినేత వైయస్ జగన్( YS Jagan ) ఏపీ స్పీకర్ కి లేఖ రాయడం జరిగింది.తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అంశంపై పరిశీలించాలని లేఖలో పేర్కొన్నారు.
మంత్రుల తర్వాత నాతో ప్రమాణం చేయించటం పద్ధతులకు విరుద్ధం.ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించుకున్నట్టున్నారు.
విపక్షంలో ఎక్కువ సీట్లు ఉన్నవారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి.ఈ హోదా కోసం పది శాతం సీట్లు ఉండాలని చట్టంలో లేదు.
ప్రతిపక్ష హోదా ఉంటేనే ప్రజా సమస్యలను బలంగా వినిపించవచ్చు.అని లెటర్ రాయడం జరిగింది.
ఈ క్రమంలో స్పీకర్ కి వైయస్ జగన్ రాసిన లెటర్ పై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధ వెంకన్న( Budda Venkanna ) ఘాటుగా స్పందించారు.జగన్ రాసిన లేఖకు ఓ బహిరంగ లేఖతో బదులిచ్చారు.
“జగన్ మోహన్ రెడ్డీ… నాడు టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉంటే… నలుగురిని లాక్కుని, ఇంకో ఇద్దరిని కూడా లాక్కుందాం అని ప్రయత్నించి చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేద్దాం అనుకున్నది నువ్వు కాదా? అని బుద్ధా వెంకన్న సూటిగా ప్రశ్నించారు.“నువ్వు ఈ లేఖ రాసే ముందు ఓసారి రాజ్యాంగ నిపుణులను కనుక్కోవాల్సింది.ఇంకా నీ పదవీ కాంక్ష తీరలేదా? మీరు… ప్రస్తుత సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, ప్రస్తుత స్పీకర్ అయ్యన్నపాత్రుడు గురించి మాట్లాడలేదా? వాళ్ల గురించి మీరు మాట్లాడిన మాటలు చూస్తే మీకు ప్రతిపక్ష హోదా కాదు కదా… అసెంబ్లీలో కూర్చునే అర్హత కూడా ఉండదు.మీకు ప్రతి పక్ష హోదా లేకుండా చేసింది చంద్రబాబు కాదు… ప్రజలు.
ముందు ఈ విషయాన్ని గమనించండి” అంటూ బుద్ధా వెంకన్న తన లేఖలో పేర్కొన్నారు.