ఆది పినిశెట్టి( Aadhi Pinisetty ) ప్రస్తుతం శబ్దం సినిమా ( Sabdham Movie ) ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈయన వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.
ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన రంగస్థలం( Rangasthalam ) సినిమా విషయాలను గుర్తు చేసుకున్నారు సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్( Ram Charan ) సమంత హీరో హీరోయిన్లుగా నటించిన రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ అన్న పాత్రలో ఆది పినిశెట్టి నటించారు.ఇక ఈ సినిమాలో ఆది పినిశెట్టి పాత్ర చనిపోతుంది.

ఇలా ఆది పినిశెట్టి చనిపోయినప్పుడు ఆ సన్నివేశం చూసిన ప్రతి ఒక్కరూ కూడా కంటతడి పెట్టుకున్నారని చెప్పాలి.థియేటర్లలో కూడా ఈ సన్నివేశం రావడంతో నిశ్శబ్ద వాతావరణంలో ప్రతి ఒక్కరు కన్నీళ్లు పెట్టుకున్నారు.అయితే ఈ సన్నివేశం షూట్ చేసే సందర్భంలో జరిగిన కొన్ని విషయాల గురించి ఆది ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ సన్నివేశం షూట్ చేసే సమయంలో నేను కళ్ళు మూసుకొని అలా కూర్చుండిపోయాను.
అయితే ఆ టైంలో సమంత, నటి రోహిణి గారు చాలా గట్టిగా ఏడ్చేశారు.వారి ఏడుపులు విని తాను భయపడిపోయానని తెలిపారు.

ఇక రోహిణి గారు తన భర్త రఘువరన్ గారి మరణాన్ని గుర్తుచేసుకొని ఆమె నిజంగానే ఏడ్చేసింది.ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత నాన్నతో కలిసి నేను థియేటర్ కి వెళ్లి సినిమా చూశాను.నాన్నగారు ఒక దర్శకుడు ఆయన ఇలాంటివి ఎన్నో సన్నివేశాలను తెరికెక్కించి ఉంటారు.అయినప్పటికీ కూడా థియేటర్లో ఈ సన్నివేశం చూడగానే ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారని ఆది తెలిపారు.
నాన్న అలా ఏడుస్తున్న సమయంలో తన చెయ్యిని పట్టుకొని నేను నీ పక్కనే ఉన్నాను నాన్న అది కేవలం ఒక సన్నివేశం మాత్రమే అంటూ న్నానని ఓదార్చినట్లు అది తెలిపారు.నిజంగానే ఈ సన్నివేశం ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకిందనే చెప్పాలి.