సమ్మర్ లో చర్మానికి అండగా చియా సీడ్స్.. ఇలా వాడితే భలే లాభాలు!

సమ్మర్ సీజన్( Summer season ) ప్రారంభమైంది.ఎండలు రోజురోజుకు ముదురుతున్నాయి.

 Try This Chia Seeds Mask For Healthy Glowing Skin In Summer! Healthy Skin, Glowi-TeluguStop.com

అయితే సమ్మర్ లో చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం పెద్ద సవాలుగా మారుతుంది.ఎండలు, అధిక వేడి కారణంగా చర్మం చాలా డ్యామేజ్ అవుతుంది.

అయితే సమ్మర్ లో చర్మ ఆరోగ్యానికి చియా సీడ్స్ అండగా ఉంటాయి. చియా సీడ్స్ ( Chia seeds ) ను ఇప్పుడు చెప్పబోయే విధంగా ఉపయోగిస్తే అదిరిపోయే స్కిన్ కేర్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.

అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ మరియు పావు కప్పు పచ్చి పాలు( raw milk) వేసుకొని బాగా మిక్స్ చేసి గంట పాటు నానబెట్టుకోవాలి.ఇలా నానబెట్టుకున్న చియా సీడ్స్ ను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ చియా సీడ్స్ మిశ్రమంలో వన్ టీ స్పూన్ తేనె( Honey ) మరియు రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ బీట్ రూట్ జ్యూస్ ( Fresh beet root juice )వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని చేతితో ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

Telugu Tips, Chiaseeds, Chia Seeds, Face, Skin, Skin Care-Telugu Health

ఆపై తడి క్లాత్ సాయంతో ప్యాక్ ను తొలగించి వాటర్ తో ఫేస్ వాష్ చేసుకోవాలి.వారానికి రెండు నుంచి మూడుసార్లు ఈ చియా సీడ్స్ మాస్క్ ను కనుక వేసుకుంటే భలే లాభాలు పొందుతారు.ముఖ్యంగా ఈ మాస్క్ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడే ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటుంది.అలాగే చియా సీడ్స్ కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి.చర్మాన్ని దృఢంగా బిగుతుగా మారుస్తాయి.ఈ మాస్క్ చర్మపు మృత కణాలను తొలగించి కొత్త కణాల పెరుగుదలను ప్రోత్స‌హిస్తుంది.

ఎండల దెబ్బకు టాన్ అయిన చర్మాన్ని రిపేర్ చేస్తుంది.

Telugu Tips, Chiaseeds, Chia Seeds, Face, Skin, Skin Care-Telugu Health

చియా సీడ్స్ లో ఉండే జింక్ మరియు ఒమేగా 3 మొటిమల చికిత్స‌లో తోడ్పడతాయి.అంతే కాకుండా ఈ మాస్క్ స్కిన్ కలర్ ను పెంచుతుంది.స్కిన్ సూపర్ గ్లోయింగ్ గా మెరిసేరా ప్రోత్సహిస్తుంది.

వేసవిలోనూ చర్మం అందంగా ఆరోగ్యంగా మెరిసిపోతూ కనిపించాలనుకుంటే తప్పకుండా ఈ చియా సీడ్స్ మాస్క్ ను ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube