అందాన్ని పెంచే ఆరెంజ్ తొక్కలు.. ఇలా వాడితే మొటిమలు మాయమై ముఖం తెల్లగా మెరిసిపోతుంది!

ప్రస్తుత సీజన్ లో విరివిరిగా లభ్యమయ్యే పండ్లలో ఆరెంజ్( Orange ) ఒకటి.పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆరెంజ్ పండ్లను ఇష్టంగా తింటుంటారు.

ఆరోగ్యపరంగా ఈ పండ్లు అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి.అయితే ఆరెంజ్ పండ్లు తినే సమయంలో తొక్కలు ఒలిచి డస్ట్ బిన్ లోకి తోసేస్తుంటారు.

కానీ వాటితోనూ చాలా ప్రయోజనాలు ఉన్నాయి.అందాన్ని పెంచడానికి ఆరెంజ్ తొక్కలు( Orange peels ) అద్భుతంగా తోడ్పడతాయి.

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే విధంగా ఆరెంజ్ తొక్కలను వాడితే మొటిమలు మాయమై మీ ముఖం తెల్లగా కాంతివంతంగా మెరిసిపోతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆరెంజ్ తొక్కలతో అందాన్ని ఎలా పెంచుకొవచ్చో తెలుసుకుందాం పదండి.

Advertisement

ముందుగా ఒక ఆరెంజ్ పండును తీసుకుని ఉప్పు నీటిలో శుభ్రంగా కడగాలి.ఆపై తొక్కను సపరేట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి.ఇప్పుడు మిక్సీ జార్ లో ఆరెంజ్ తొక్కలతో పాటు అరకప్పు రోజ్ వాటర్( Rose water ) వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్‌ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి, వన్ టేబుల్ స్పూన్ ఎర్ర కందిపప్పు పిండి( Red gram flour ), పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆ తర్వాత చర్మాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

రెండు రోజులకు ఒకసారి ఈ వండర్ ఫుల్ హోమ్ రెమెడీని పాటిస్తే ముఖంపై ఎలాంటి మొండి మొటిమలు మచ్చలు ఉన్నా క్రమంగా మాయం అయిపోతాయి.డెడ్ స్కిన్ సెల్స్ ఏమైనా ఉంటే తొలగిపోతాయి.ముఖ చర్మం తెల్లగా కాంతివంతంగా మారుతుంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

కాబట్టి సహజంగానే చర్మాన్ని అందంగా మెరిపించుకోవాలనుకునే వారు తప్పకుండా ఆరెంజ్ తొక్కలతో పైన చెప్పిన రెమెడీని పాటించండి.

Advertisement

తాజా వార్తలు