సాధారణంగా చాలా మంది మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అలా కొద్దిసేపు నిద్రపోతూ ఉంటారు.అలాగే చాలామందికి భోజనం చేసిన తర్వాత నిద్ర వస్తూ ఉంటుంది.
అయితే అందరికీ తెలియని విషయం ఏమిటంటే భోజనం చేసిన తర్వాత మధ్యాహ్నం సమయంలో పడుకోవడం అసలు మంచిది కాదు.అసలు నిద్రపోవద్దని చెప్పడం లేదు కానీ ఒక 30నిమిషాలు పడుకోవడం మంచిదే.
కానీ అరగంట కంటే ఎక్కువ నిద్రపోవడం వలన హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.అంతేకాకుండా అధిక రక్తపోటు ( High blood pressure )వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.
మధ్యాహ్నం భోజనం చేసినా తర్వాత నిద్ర వస్తున్నట్లు అనిపిస్తే నిద్ర పట్టేసి గంటల తరబడి చాలా మందిని నిద్రిస్తూ ఉంటారు.
దీని మూలంగా రాత్రి సమయంలో సరైన నిద్ర పట్టదు.శరీరానికి సరైన విశ్రాంతి కూడా దొరకదు.ఇది మన ఆరోగ్యం పై చెడు ప్రభావం చూపిస్తుంది.
అలాగే మధ్యాహ్నం పూట పదేపదే నిద్రపోయేవారిలో అధిక బరువు పెరిగే అవకాశలు కూడా ఉన్నాయి.మధ్యాహ్నం సమయంలో అధికంగా నిద్రపోయే వారిలో హార్ట్ ఎటాక్ ( Heart attack )సమస్యలు వచ్చే అవకాశం ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.
అలాగే ఎక్కువసేపు పడుకోవడం కంటే తక్కువ టైమ్ పడుకోవడం వలన చాలా ఆరోగ్య లాభాలు ఉన్నాయి.
మధ్యాహ్నం సమయంలో ఎక్కువసేపు పడుకోవడం వలన అది మీ ఒత్తిడిని దూరం చేస్తుంది.దీర్ఘకాలం నిద్రపోవడం కంటే 30 నిమిషాల వరకు నిద్రపోయేవారు ఆరోగ్యంగా ఉంటారు.మధ్యాహ్నం రకరకాల పనులు చేయడం వలన మన శరీరం అలసటకు గురవుతుంది.
కాబట్టి తగినంత విశ్రాంతినీ శరీరం కోరుకుంటుంది.ఇక రాత్రి సమయంలో సరైన నిద్రను స్మార్ట్ ఫోన్లు( Smart phones ) చాలా సేపు ఉపయోగించడం వల్ల, మద్యం సేవించడం ఇలాంటివి చేయడం వల్ల సరైన నిద్ర పట్టడం లేదు.
కాబట్టి అందరూ రాత్రిపూట ఎనిమిది గంటలకు నిద్ర పోవడానికి ప్రయత్నించాలి.