సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టనష్టాలు ఎదురవడం సహజమే.కానీ కొందరి జీవితంలో మాత్రం నిత్యం కష్టాల సుడిగుండంలో చిక్కుకుపోయి ఉంటారు.
వారు ఆ కష్టాలను అధిగమించడానికి నిరంతరం కృషి చేస్తున్నప్పటికీ ఎలాంటి ఫలితాలు ఉండక అయోమయ స్థితిలో పడుతుంటారు.మరి కొందరి విషయంలో లక్ష్మీకటాక్షం కలిగినట్టే కలిగే కరిగిపోతుంది.
ఈ విధంగా మన జీవితంలో ఎన్నో కష్టాలు ఏర్పడటానికి గల కారణం ఆ లక్ష్మి కటాక్షం మనపై కలగకపోవడం.అయితే కర్పూరంతో ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మన జీవితంలో ఏర్పడినటువంటి కష్టాలు తొలగిపోతాయనీ పండితులు చెబుతున్నారు.
అయితే కర్పూరంతో ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం…
ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు పడే వారు ఉదయం లేచి తలంటు స్నానం చేసి ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకున్న తర్వాత లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహానికి ప్రత్యేకంగా అలంకరణ చేయాలి.అలంకరణ అనంతరం అమ్మవారికి ఆవునెయ్యితో దీపారాధన చేసి పూజించాలి.
అనంతరం ఐదు కర్పూర బిల్లలను తీసుకొని వాటినిశుభ్రమైన ఎర్రటి వస్త్రంలో మూటకట్టి లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచాలి.ఆ కర్పూర మూటకు పసుపు, కుంకుమలతో బొట్టు పెట్టి అగరబత్తుల దూపం వేయాలి.
పూజ చేసిన తర్వాత మన ఇంట్లో మనం పడుతున్నటువంటి కష్టాలను అమ్మ వారికి తెలియజేస్తూ వాటి నుంచి విముక్తి పొందాలని లక్ష్మీ దేవతను పూజించాలి.

పూజ అనంతరం కొద్దిసేపటి వరకు ఆ కర్పూరం మూటని అమ్మవారి ఎదురుగానే ఉంచాలి.కొద్దిసేపటి తర్వాత పూజ చేసినటువంటి ఆ కర్పూరం మూటను మనం ఎక్కడైతే డబ్బులు దాచి పెడతామో ఆ చోటులో పెట్టడం వల్ల మనకు కష్టాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.అదే విధంగా వ్యాపారాభివృద్ధి చెందాలని అనుకునేవారు ఈ మూటను వారు వ్యాపారం చేసే చోట పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి జరుగుతుంది.
ఈ విధంగా మనం డబ్బులు బంగారం దాచేచోట కర్పూరాన్ని పెట్టడం వల్ల మనకు ఈతిబాధలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు తెలియజేస్తున్నారు.