పూర్వ కాలం నుండి స్త్రీలు నగలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో చూస్తూన ఉన్నాం.స్త్రీలు రకరకాల ఆభరణాలు చేయించుకుంటూ నలుగురికి చూపించి ఆనందపడటం చేస్తూ ఉండటం సాధారణంగా జరుగుతుంది.
అదే పుట్టింటి వారుచేయించినవి అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు.వాటిని చాలా అపురూపంగా చూసుకుంటారు.
అంతేకాక వంశపారంపర్యంగా వచ్చే ఏడు వారాల నగలను ఇంకా చాలా అపురూపంగ చూసుకుంటారు.పూర్వ కాలంలో తమ స్థాయిని చెప్పటానికి ఏడు వారాల నగలన ధరించేవారు.
ప్రతి రోజు ధరించకపోయిన పర్వ దినాల్లో మాత్రం తప్పనిసరిగా ధరించేవారు.
ఆదివారం రోజున ‘కెంపులు’… సోమవారం రోజున ‘ముత్యాలు‘… మంగళవారం రోజున ‘పగడాలు’… బుధవారం రోజున ‘పచ్చలు‘… గురువారం రోజున ‘పుష్యరాగాలు’…శుక్రవారం రోజున ‘వజ్రాలు’… శనివారం రోజున ‘నీలాలు’ స్త్రీలు ధరించే ఆభరణాల్లో వుండాలని మన పెద్దలు నియమం చేసారు.
ఇలా ఏడు వారాల నగలను ధరించటం వెనక ఆరోగ్యపరమైన కారణాలు కూడా ఉన్నాయి.ఈ క్రమంలో ఏడువారాల నగలు ధరించడం వలన ఆయురారోగ్యాలు పెరుగుతాయనీ … సంతాన సౌభాగ్యాలు నిలుస్తాయని స్త్రీల నమ్మకం.
అంతేకాక ఆయా గ్రహాల అనుగ్రహం కూడా ఉంటుందని విశ్వసిస్తారు.