ముఖ్యంగా చెప్పాలంటే హోలీ రోజు చంద్రగ్రహణం వచ్చింది.అయితే ఈ చంద్రగ్రహణం సమయంలో కొన్ని పనులు అస్సలు చేయకూడదు.
ఒక వేళ అవి చేశారంటే మీ జీవితంలో ఎన్నో కష్టాలను చూడవలసి వస్తుంది.చంద్రగ్రహణానికి సైన్స్ నుంచి మతం, జ్యోతిష్యం( Astrology ) వరకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది.
హిందూ గ్రంధాలలో గ్రహణం గురించి చాలా నియమాలు ఉన్నాయి.గ్రహణా సమయంలో కొన్ని పనులు అస్సలు చేయకూడదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
మరి ఆ పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది మొదటి చంద్రగ్రహణం మార్చి 24వ తేదీన ఫాల్గుణ పౌర్ణమి రోజు( Phalguna pournami ) వస్తుంది.ఈ నెల 25న ఉదయం 10:24 నిమిషములకు చంద్రగ్రహణం మొదలవుతుంది.ఇది మధ్యాహ్నం మూడు గంటల ఒక నిమిషం వరకు ఉంటుంది.
మరి చంద్రగ్రహణం సమయంలో ఏ ఏ పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.చంద్రగ్రహణం సమయంలో మీ చుట్టూ నెగెటివ్ ఎనర్జీ ఉంటుంది.
దీని వల్ల మీరు ఈ సమయంలో ఆహారం తినడం కానీ, వండడం కానీ అసలు చేయకూడదు.చంద్రగ్రహణం( Lunar eclipse ) సమయంలో కడుపుతో ఉన్నా మహిళలు ఇంట్లో నుంచి అసలు బయటికి రాకూడదు.

ఎందుకంటే గ్రహణం గర్భం లో ఉన్న శిశువు పై ప్రతికూల ప్రభావం చూపుతుందని చాలా మంది ప్రజలు నమ్ముతారు.చంద్రగ్రహణం సమయంలో గర్భిణీలు పదునైన వస్తువులను ఉపయోగించకూడదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.అంటే కత్తెర, చాకులు, మొదలైన వాటిని అసలు ఉపయోగించకూడదు.ఎందుకంటే ఇది పిల్లల పై చెడు ప్రభావాన్ని చూపుతుందని శాస్త్రాలలో ఉంది.హిందూ పురాణాల ప్రకారం గ్రహణ సమయంలో అసలు నిద్రపోకూడదు.ఇలా నిద్రపోవడాన్ని అ శుభంగా భావిస్తారు.
నిద్రపోతే మీ ఆరోగ్యం పై చెడు ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.కొంతమంది తెలియకుండా ఆ గ్రహణ సమయంలో కూడా పూజలు చేస్తుంటారు.
కానీ చంద్రగ్రహణం లో పూజలు అస్సలు చేయకూడదు.అలాగే ఇంటి దేవాలయాన్ని కూడా తెరిచి ఉంచకూడదు.
దీన్ని అశుభంగా భావిస్తారు.అలాగే చంద్ర గ్రహణ సమయంలో తులసి మొక్కను అస్సలు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు.
గ్రహణ సమయంలో ఒక తులసి మొక్కనే కాకుండా ఏ మొక్కను కూడా తాకకూడదు.