మంత్ర జపానికి జప మాలను వినియోగిస్తారు.సాధారణంగా జప మాలలో 108 పూసలు లేదా రుద్రాక్షలు ఉంటాయి.
అందువల్ల మంత్ర జపం కనీసం 108 సార్లు చేయాలని గ్రహించాలి.ఒక ఆవృత్తి.
అంటే అందులో ఉన్న 180 పూర్తిగా పూర్తి అయిన తరువాత మరల మొదటి పూస నుండి ప్రారంభించి జపం కొనసాగించ వచ్చు.ఇలా ఎన్ని సార్లు అయినా అవకాశాన్ని బట్టి మంత్ర జపం చేయవచ్చు.
మంత్రాలను అక్షర లక్షలుగా జపించాలని కూడా మన పురాణాలు చెబుతున్నాయి.దాని వల్ల ఎలాంటి హాని కల్గదు.
అను నిత్యం పదిహేను ఇరవై వేల సార్లు జపం చేస్తే మనస్సు ఇష్ట దైవం మీద నెలకొంటుంది” అని శ్రీ శారదా దేవి చెప్పింది.
అయితే కొన్ని మంత్రాలకు ఇన్నిసార్లు జపించాలి అని విధి వుంటుంది.
అలా జపించకపోతే సిద్ధి కల్గకపోవచ్చు.కాని ఎక్కువ జపించడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు.
ఇతరులకు హాని కల్గించే ఉద్దేశంతో మాత్రం జపం చేయరాదు.జప సమయంలో కేవలం లెక్క మీదనే మనస్సు ఉంచితే అది ఇష్ట దైవం మీద లగ్నం కాదు.
కాన లెక్కను పట్టించుకోకుండా జపం కొనసాగించాలని మహనీయులు చెబుతుంటారు.అందుకే మంత్ర జపం చేసే వాల్లు ఇలాంటి నియమాలను పాటిస్తూ… హాయిగా జపం చేస్కుంటారు.
మీరు కూడా ఇలాగే ప్రయత్నంచండి.ఎక్కువ సార్లు మంత్రాలను జపించినా పర్లేదు కానీ తక్కువ కాకుండా చూస్కోండి.
దాని వల్ల మీకు చాలా లాభాలు ఉంటాయి.