ఎముకల బలహీనత.చాలా మందిలో కామన్‌గా కనిపించే సమస్య ఇది.ఎముకలు బలహీనంగా మారిపోవడం వల్ల.ఏ పనీ చేయలేకపోతుంటారు.
బరువులు మోయలేకపోతుంటారు.నిటారుగా కూర్చోలేరు.
నిలబడనూలేరు.ఎందుకంటే, శరీరాన్ని నిలబెట్టేది ఎముకలే.
అందుకే ఎముకలను దృఢంగా ఉంచుకోవడం ఎంతో అవసరం.అయితే అందుకు కొన్ని కొన్ని ఆకుకూరలు అద్భుతంగా సహాయపడతాయి.
మరి ఆ ఆకుకూరలు ఏంటో ఆలస్యం చేయకుండా ఓ లుక్కేసేయండి.
ఎముకలను బలోపేతం చేయడంలో బ్రొకోలీ సూపర్‌గా సహాయపడుతుంది.
బ్రొకోలీలో ఇతర పోషకాలతో పాటుగా కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది.అందువల్ల, బ్రొకోలీని వారంలో మూడు, నాలుగు సార్లు తీసుకుంటే ఎముకల బలహీనత పరార్ అవుతుంది.
ఆకుకూరల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న బచ్చలి ఆకు..ఎముకల ఆరోగ్యాన్ని పెంచడంలోనూ ఉపయోగపడతాయి.బచ్చలి ఆకు రసానికి చెంచాడు తేనె కలిపి ప్రతిరోజూ తీసుకుంటే ఎముకలు బలంగా మారడమే కాదు.రక్త హీనత తగ్గుతుంది, మెదడు చురుగ్గా మారుతుంది, చర్మం యవ్వనంగా మారుతుంది.
ఎముకల బలహీనతను నివారించడంలో క్యాబేజ్ కూడా ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది.
క్యాబేజ్‌ను తరచూ తీసుకుంటూ ఉంటే.అందులో ఉండే పోషక విలువలు ఎముకలను గట్టిపడేలా చేస్తాయి.
అంతేకాదు, క్యాబేజ్‌ను తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు, క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది, రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
బోన్స్‌ను బలపరచడంలో కొత్తి మీర కూడా సహాయపడుతుంది.కొత్తిమీరలో కాల్షియం కంటెంట్ అధికంగా ఉంటుంది.కాబట్టి, కొత్తిమీర రసం రూపంలో లేదా ఇతరితర విధాలుగా తీసుకుంటే.
ఎముకలు ఆరోగ్యంగా మారతాయి.
ఇక పాలకూర కూడా ఎముకలకు ఎంతో మేలు చేస్తుంది.
పాలకూరలో కాల్షియంతో పాటుగా విటమిన్ కె కూడా ఉంటుంది.అందు వల్ల, పాల కూరను డైట్‌లో చేర్చుకుంటే గనుక.
ఎముకల బలహీనత తగ్గు ముఖం పడుతుంది.