‘పుష్ప-2’ రీలోడెడ్ వెర్షన్‌ రెడీ.. నేటి నుంచి థియేటర్లలో మరో ఆఫర్

ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా, దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప-2’( Pushpa 2 ) మూవీ డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.ఫస్ట్ షో నుంచే భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం కలెక్షన్లలో ‘తగ్గేదేలే’ అని మరింత ముందుకెళ్లింది.ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా రూ.1800 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా అనేక రికార్డులను తిరగరాసింది.ఇకపోతే తాజాగా, పుష్ప-2కు సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.మేకర్స్ పుష్ప-2 రీలోడెడ్ వెర్షన్‌ను( Pushpa 2 Reloaded Version ) నేటి నుండి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు.

 Allu Arjun Pushpa 2 Reloaded Version Ready To Mesmerize Fans Details, Pushpa 2,-TeluguStop.com

రిలీజ్ సమయంలో ఎడిటింగ్‌లో తీసేసిన 20 నిమిషాల ఫుటేజ్‌ను ఈ రీలోడెడ్ వెర్షన్‌లో యాడ్ చేసి, నేటి నుండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న థియేటర్లలో ప్రదర్శించనున్నారు.ఈ న్యూ వర్షన్‌తో సినీ ప్రేక్షకులు మరోసారి థియేటర్లలో పుష్ప మ్యాజిక్‌ను ఆస్వాదించే అవకాశం పొందుతున్నారు.అంతేకాదు, రీలోడెడ్ వెర్షన్‌ను మరింత ప్రేక్షకులకు చేరువ చేయడానికి మేకర్స్ టికెట్ ధరలను కూడా తగ్గించారు.

నైజాంలో మాత్రం సింగిల్ స్క్రీన్‌లో టికెట్ ధరను రూ.112గా, మల్టీప్లెక్స్‌లో రూ.150గా నిర్ణయించారు.ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అఫీషియల్‌గా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.ఈ నిర్ణయంతో పుష్ప-2 అభిమానులు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

ప్రేక్షకులను మరింత ఎంటర్టైన్ చేయడమే కాకుండా, ఈ రీలోడెడ్ వెర్షన్ మరోసారి కలెక్షన్ల బాటలో పరుగులు తీయనుందనడంలో ఎటువంటి సందేహం లేదు.పుష్ప ఫీవర్ థియేటర్లలో ఇంకా కొనసాగుతుందని చెప్పొచ్చు.

ఇకపోతే సంక్రాంతి నేపథ్యంలో విడుదలైన గేమ్ చెంజర్, సంక్రాంతికి వస్తున్నాం, ఢాకు మహారాజ్ లు ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తున్నాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube