టాలీవుడ్ హీరోలు కొనుక్కున్న ఈ చార్టెడ్ ఫ్లైట్స్ ధర ఎంతో తెలుసా..?

తెలుగు తెరపై హీరో గా కనిపించడానికి చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ వచ్చి సినిమాలు చేసి హీరోలుగా నిలదొక్కుకున్నారు.వారిలో కటిక పేదరికం నుంచి వచ్చిన ఎన్టీఆర్, నాగేశ్వరరావు లాంటి వారు ముందు వరుసలో ఉంటారు.

 Tollywood Heros Charted Flights Cost , Chirenjeeevi, Mahesh Babu, Charted Flight-TeluguStop.com

వీరు నాటకం అనేది వేరు సినిమా అనేది వేరు అని సినిమాల్లో హీరోగా చేసి తమకు తాము నటులుగా ప్రూవ్ చేసుకున్నారు తర్వాత తమ వారసులు కూడా ఇండస్ట్రీకి వచ్చారు.అలాగే సినిమా ఇండస్ట్రీలో కొన్ని వేల కోట్లు సంపాదించారు.

వీళ్ళ తర్వాత పేదరికం నుంచి వచ్చి స్టార్ హీరో అయిన ఇంకో వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి.చిరంజీవి కూడా ఇండస్ట్రీలో కొన్ని కోట్లు సంపాదించారు తర్వాత వాళ్ళ వారసులని కూడా పరిచయం చేశారు.

అయితే ఇండస్ట్రీలో ఒకసారి సక్సెస్ అయిన తర్వాత లగ్జరీ లైఫ్ కి అలవాటు పడిపోతారు అలాంటి లగ్జరీ లైఫ్ లో వాళ్లకి కనిపించిన కార్లను కొంటూ ఉంటారు.కొంతమంది ల్యాండ్ ని ఎక్కువగా కొనుగోలు చేస్తారు.

సినిమా ఇండస్ట్రీ లో హీరోలు వాళ్ల కోసం వాళ్లు కొనుక్కోవడమే కాకుండా వాళ్లు ఫ్లాపుల్లో ఉన్నప్పుడు హిట్ ఇచ్చిన దర్శకులకు కూడా ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తుంటారు.

మొన్నటికి మొన్న శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కొరటాల శివకి మహేష్ బాబు ఆడి కార్ గిఫ్ట్ గా ఇచ్చాడు.

ప్లాపుల్లో ఉన్నప్పుడు హీరోలకి హిట్ ఇస్తే దర్శకులపై వాళ్ల ప్రేమని గిఫ్ట్ రూపకంగా చూపిస్తారు.అయితే ఇండస్ట్రీలో గిఫ్ట్ లు ఇవ్వడం అనేది కామన్ అయిపోయింది.రామ్ చరణ్ బర్త్ డే రోజు వాళ్ల నాన్న అయిన చిరంజీవి తనకి మూడు కోట్లు పెట్టి ఆడి కార్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు.ఒకప్పుడు కటిక పేదరికం నుంచి వచ్చిన చిరంజీవి మూడు కోట్లు పెట్టి కారు గిఫ్ట్ గా ఇచ్చారు అంటే ఆయన ఎన్ని కోట్లు సంపాదించాడో మనం అర్థం చేసుకోవచ్చు.

అయితే ఇండస్ట్రీలో తాము నడిపే కార్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని హీరోలు మంచి మంచి కార్లని కొంటారు.స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వాళ్ళ నాన్న అల్లు అరవింద్ పెద్ద ప్రొడ్యూసర్ అని మన అందరికీ తెలుసు.

అలాగే అల్లు అర్జున్ కూడా ఎంత పెద్ద హీరో అనేది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు రీసెంట్ గా అలా వైకుంఠపురం లో సినిమాతో ఒక సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టాడు.అయితే సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు అరెంజ్ చేసే కారేవ్యాన్ లు అల్లు అర్జున్ కి సరిగా నచ్చకపోవడంతో 5 కోట్లు పెట్టి తనే స్వయంగా ఒక కారేవ్యాన్ చేయించుకున్నారు.

Telugu Heros Flights, Mahesh Babu, Pooja Hedge, Tollywood, Tollywoodheros-Telugu

ఇదిలా ఉంటే వేరే రాష్ట్రాలకు వెళ్లాలన్నా దేశాలకు వెళ్లాలన్న అందరితో కలిసి వెళ్లాలంటే హీరోలకి వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ కు ఎంతైనా ఇబ్బంది ఎందుకంటే ఫ్లైట్ లో చాలామంది ట్రావెల్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్లు హీరోలను సెల్ఫీల నీ, ఫోటోలని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ ప్రైవేట్ లైఫ్ ఇబ్బంది పెట్టే జనాల వల్ల విసిగిపోయిన హీరోలు ప్రైవేటుగా 80,90 కోట్లు పెట్టి జెట్ విమానాలు కొన్నారు అందులో సొంతంగా పెద్ద హీరో అయినా చిరంజీవికి ఒక జెట్ ఫ్లైట్ ఉంది.ఇండస్ట్రీలో ఉన్న టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారికి కూడా ఒక ప్రైవేట్ ఫ్లైట్ ఉంది అలాగే ఈ మధ్య జూనియర్ ఎన్టీఆర్ కూడా జెట్ ఫ్లైట్ తీసుకున్నారు.వీళ్లతో పాటు నాగార్జున నాగచైతన్య అఖిల్ లాంటి అక్కినేని ఫ్యామిలీ అందరు కూడా ట్రావెల్ చేయడానికి అనుకూలంగా ఉండే విధంగా ఒక జెట్ ఫ్లైట్ ని తయారు చేయించుకున్నారు.

Telugu Heros Flights, Mahesh Babu, Pooja Hedge, Tollywood, Tollywoodheros-Telugu

వీళ్లతో పాటు అలా వైకుంఠపురం లో సినిమా తో ఒక మంచి బ్లాక్ బస్టర్ కొట్టిన హీరోయిన్ పూజా హెగ్డే కి కూడా ఒక ప్రైవేటు జెట్ ఫ్లైట్ ఉంది.ఇలా హీరోలు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి అనుకూలంగా ఉండే విధంగా తమ తమ కార్లని తమ తమ ఇళ్లను అలాగే ఇలాంటి జెట్ ఫ్లైట్ ని కూడా తప్పనిసరిగా తీసుకుంటున్నారు.ఒకప్పుడు తినడానికి తిండి కూడా లేని పేదరికం నుంచి వచ్చి ఇండస్ట్రీలో పెద్ద హీరోలు అయిపోయి ఇప్పుడు ఏకంగా ఫ్లైట్ కొన్నారు అంటే వాళ్ల జీవితాన్ని వాళ్ళు ఎంతలా ఇంతలా కష్టపడి పైకి వచ్చారో మనం అర్థం చేసుకోవచ్చు.

అలాంటి వారిని మనం ఆదర్శంగా తీసుకొని ఎవరైనా కష్టపడి పని చేస్తే వాళ్ల రంగం లో వాళ్లు పైకి వస్తారు.కష్టం ముందు ఏది ఎక్కువ కాదు అని చూపించిన చాలామంది హీరోలకు ఈరోజు హ్యాట్సాఫ్ చెప్పుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube